100 కోట్లు పైగా రాకింగ్ స్టార్ పారితోషికం?
వీరంతా 100 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకునే హీరోలుగా ఎదిగారనిక మీడియాలో కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Oct 2023 7:54 AM GMTభారతదేశంలో అత్యధిక పారితోషికాలు అందుకునే ఐదుగురు హీరోల పేర్లు ఏవి? అంటే అందులో ఖాన్‌ల త్రయం సహా ప్రభాస్, రజనీకాంత్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు కూడా జాబితాలో చేరింది. వీరంతా 100 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకునే హీరోలుగా ఎదిగారనిక మీడియాలో కథనాలొస్తున్నాయి.
కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో యష్ పేరు మార్మోగింది. కేజీఎఫ్- కేజీఎఫ్ 2 చిత్రాలు ఘనవిజయాలు సాధించడమే గాక రెండో భాగం 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా యష్ స్టార్ డమ్ మోగుతోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు అతడు పారితోషికం అమాంతం పెంచాడని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం మేరకు యష్ తన తదుపరి భారీ చిత్రం కోసం 150కోట్లు వసూలు చేస్తున్నాడని ప్రముఖ మీడియా కథనం వెలువరించింది.
ఇది నితీష్ తివారీ `రామాయణం` అని ప్రచారం ఉంది. ఇందులో యష్ రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. దీనికోసం అతడు ఇప్పటికే ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఫోటోషూట్ పూర్తయింది. మరోవైపు ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తారని, సీతగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారని ప్రచారం ఉంది.
యష్ తదుపరి KGF మూడవ భాగంలో నటించాల్సి ఉండగా, అంతకుముందే అతడు రామాయణంలో అవకాశం అందుకోవడం యాధృచ్ఛికం. ఇది అరుదైన అవకాశం. ఈ సినిమా అతడి స్థాయిని అమాంతం పెంచడం ఖాయమని అంచనా వేస్తున్నారు. యష్ ప్రస్తుతం కన్నడంలో ఒక మహిళా దర్శకురాలితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఒక్కో ప్రాజెక్ట్ కోసం అతడు రూ.100 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని గుసగుస ఉంది. షెడ్యూల్స్ వర్కింగ్ డేస్ ని బట్టి కూడా అతడి పారితోషికం నిర్ణయమవుతుందని తెలిసింది.
రామాయణం చిత్రానికి లంకేయునితో రాముని పోరాట ఘట్టం చాలా కీలకం. ద్వితీయార్థంలో రావణాసురుడి పాత్ర పరిధి విస్త్రతంగా ఉంటుంది. యష్ తన నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు అరుదైన అవకాశంగా పరిగణించాలి. యష్ ఇప్పటికే `రామాయణం: పార్ట్ 1` చిత్రీకరణ కోసం 15 రోజులు కేటాయించాడు. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. అల్లు అరవింద్ -మధు మంతెన నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాపులర్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తునున్నారు.