Begin typing your search above and press return to search.

రాకీ మీట్స్ దేవ.. ఏంటి స్పెషల్

అయితే ఈ మూవీ సెట్స్ కు తాజాగా స్టార్ హీరో యశ్ వచ్చారు. సెట్స్ అంతా కలియతిరిగారు. మూవీ టీమ్ తో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 12:14 PM GMT
రాకీ మీట్స్ దేవ.. ఏంటి స్పెషల్
X

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. శాండల్ వుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంత చేసుకున్న ఆయన.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తెలుగులో స్టార్ హీరో రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుజ్జిబాబు కాంబోలో రానున్న సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. దీంతోపాటు మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే శివరాజ్ కుమార్ తొలిసారి తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అద్వైత్ తో తన 131 సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. కన్నడ- తెలుగు బైలింగ్వెల్ ఫిల్మ్ గా రానున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. శివరాజ్ కుమార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ దేవగా కనిపించనున్నారు.

దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ సెట్స్ కు తాజాగా స్టార్ హీరో యశ్ వచ్చారు. సెట్స్ అంతా కలియతిరిగారు. మూవీ టీమ్ తో మాట్లాడారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ తో కాసేపు డిస్కస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రాకీ మీట్స్ దేవ పేరుతో Shivanna131 మేకర్స్.. నెట్టింట పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ దర్శకురాలు గీతా మోహన్ దాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. కేజీఎఫ్‌ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ చేస్తున్న మూవీ కావడంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు, శివరాజ్ కుమార్ 131వ మూవీని భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఏజే శెట్టి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ఇటీవల స్టార్ట్ అయింది షూటింగ్. అయితే ఇప్పుడు యశ్ సెట్స్ కు రావడంతో.. ఆయన క్యామియో రోల్ చేస్తున్నారా అని కొందరు అడుగుతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.