Begin typing your search above and press return to search.

చెన్నై నుంచి కాపురం హైద‌రాబాద్ కి!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె కెరీర్ జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 11:30 AM GMT
చెన్నై నుంచి కాపురం హైద‌రాబాద్ కి!
X

సీనియ‌ర్ న‌టి రోహిణి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల న‌టిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో సినిమాల్లో న‌టించారు. అటుపై హీరోయిన్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో ఎన్నో చిత్రాల్లో న‌టించారు. దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా న‌టిగా కొన‌సాగు తున్నారు. ప్ర‌స్తుతం సౌత్ లో ఎక్కువ‌గా తెలుగు సినిమాల్లోనే న‌టిస్తున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె కెరీర్ జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

అవేంటో ఆమె మాట‌ల్లోనే.. `బాలనటిగా వివిధ భాషల్లో నేను 75 సినిమాలు చేసాను. వాటిలో తెలుగు సినిమాలే ఎక్కువ. శ్రీదేవి గారు నాకంటే సీనియర్. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 350కి పైగా సినిమాలు చేశాను. తెలుగులో హీరోయిన్ వేషాల కోసం నన్ను ఎవరూ అడగలేదు. తమిళంలో హీరోయిన్ గా ఓ పది సినిమాలు చేసాను. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. మలయాళంలో హీరోయిన్ గా చాలా సినిమాలు చేశాను. అక్కడ నాకు మంచి సక్సెస్ రేటు ఉండేది.

`అలా మొదలైంది`కి ముందు వరకూ తెలుగులో నన్ను పట్టించుకోలేదు. ఆ సినిమా నుంచి మళ్లీ ఇక్కడ బిజీ అయ్యాను. ఇప్పుడు కూడా నెలకి 20 రోజులు హైదరాబాద్లో ఉంటున్నాను. అందువల్ల‌ త్వరలో చెన్నై నుంచి ఇక్కడికి మారే ఆలోచనలో ఉన్నాను. నేను యంగ్ గా కనిపిస్తున్నానని చాలామంది అంటారు. అందుకు కారణం నా ఆహారపు అలవాట్లే. 50 ఏళ్ల కెరియర్లో బాగా సంపాదించానని అనుకోవడం సహజం.

మలయాళం సినిమాలు ఎక్కువ చేశాను. అవి బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు చేస్తున్నవి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా. ఎంత ఇస్తారనేది అందరికి తెలిసిందే. నేను ఆర్ధికంగా ప‌ర్వాలేదు. కొత్త దర్శకులు కూడా నన్ను గుర్తుపెట్టుకుని అవకాశాలు ఇవ్వ‌డం సంతోషంగా ఉంది` అన్నారు. ఇటీవల రిలీజ్ అయిన మ‌త్తు వ‌ద‌ల‌రా-2, వెట్టేయాన్ చిత్రాల్లోనూ రోహిణి న‌టించారు.