బిగ్ బాస్ 8 : కమెడియన్ వర్సెస్ యాంకర్.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు..?
బిగ్ బాస్ సీజన్ 8 లో ఫైనలిస్ట్ అయ్యేందుకు కేవలం ఒకే ఒక్క వారం మాత్రమే ఉంది. ఐతే సీజన్ 8 లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
By: Tupaki Desk | 2 Dec 2024 9:47 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో ఫైనలిస్ట్ అయ్యేందుకు కేవలం ఒకే ఒక్క వారం మాత్రమే ఉంది. ఐతే సీజన్ 8 లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు. సీజన్ 8 లో కూడా సీజన్ 7 లో లానే టాప్ 5 కాకుండా టాప్ 6 ఉంచుతున్నారు. ఐతే ఈ వీక్ అవినాష్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉంటారని తెలుస్తుంది. ఆడియన్స్ ఓటింగ్ తో ఎవరు సేఫ్ అవుతారు.. ఎవరు ఫైనల్స్ దాకా వెళ్తారంటూ బిగ్ బాస్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ ని తప్ప అందరినీ నామినేషన్స్ లో ఉంచాడు.
అవినాష్ తో పాటు టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతం లు కూడా దాదాపు సేఫ్ అయినట్టే. ఆ తర్వాత నబీల్, ప్రేరణ ఉన్నారు. ఐతే ఎటొచ్చి ఈ వీక్ విష్ణు ప్రియ, రోహిణిల మధ్య ఎలిమినేషన్ ఉండబోతుంది. రోహిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. తనకు ఛాన్స్ రావాలే కానీ అదరగొట్టేస్తుంది అనిపించేలా గత రెండు మూడు వారాలుగా టాస్కులు ఆడుతూ వచ్చింది. ఐతే రోహిణి ఈ సీజన్ లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు. అదే ఆమెకు మైనస్ అయ్యేలా ఉంది.
ఇక విష్ణు ప్రియ మొన్నటిదాకా పృధ్వి మీద ఫోకస్ చేసింది. టాస్కుల్లో కూడా పెద్దగా ఆడింది ఏమి లేదు. కానీ విష్ణు ప్రియకు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ. కాబట్టి ఆమెను ఎలాగైనా ఫైనలిస్ట్ చేయాలని అనుకుంటారు. సో ఈ వీక్ డేంజర్ జోన్ లో రోహిణి, విష్ణు ప్రియ ఉంటారని చెప్పొచ్చు. ఐతే ఈ ఇద్దరిలో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు. ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారన్నది నెక్స్ట్ సండే తెలుస్తుంది.
అయితే ఒకరేమో యాంకర్.. మరొకరేమో కమెడియన్ ఇలా ఇద్దరు తమ ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఆడియన్స్ ఎవరికి హౌస్ లో ఉండే అర్హత ఉందని ఓటేస్తారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ విన్నర్ రేసులో నిఖిల్, గౌతం మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఐతే ఇద్దరిలో ఎవరు విజేత అన్నది తెలియాలంటే సీజన్ ఫైనల్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇద్దరు కూడా తమ ఆటతో బిగ్ బాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఐతే ఇందులో నిఖిల్ మొదటి నుంచి హౌస్ లో ఉండగా గౌతం మాత్రం వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు.