బిగ్ బాస్ 8 : డబల్ ఎలిమినేషన్ షాక్.. ఆ ఇద్దరు ఎవరంటే..?
మరోపక్క నామినేషన్స్ లో అవినాష్ తప్ప అందరు ఉండగా డబల్ ఎలిమినేషన్ లో భాగంగా ముందు రోహిణిని ఎలిమినేట్ చేశారు.
By: Tupaki Desk | 8 Dec 2024 4:04 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటికే రెండు సార్లు డబల్ ఎలిమినేషన్ కాగా మూడోసారి కూడా డబల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముందే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని చెప్పి. హౌస్ మేట్స్ ఇన్ని వారాల ఆటలో తాము రిగ్రెట్ ఫీల్ అయిన వారం గురించి చెప్పమని అన్నాడు. దానికి ఒక్కో హౌస్ మేట్ ఒక్కో వారం లో తాము చేసిన పని గురించి చెప్పారు. మరోపక్క నామినేషన్స్ లో అవినాష్ తప్ప అందరు ఉండగా డబల్ ఎలిమినేషన్ లో భాగంగా ముందు రోహిణిని ఎలిమినేట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 3 లో రోహిణి వచ్చినా అప్పుడు అంత ఇంపాక్ట్ కలిగేలా చేయలేదు. కానీ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఆమె తన ఆటతో మెప్పించింది. చివరి మెగా చీఫ్ టాస్క్ ఆడి గెలిచిన రోహిణి ఈ సీజన్ లో ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాలేదు. అదే ఆమెకు మైనస్ అయ్యింది. రోహిణి ఈ సీజన్ లో తన బెస్ట్ ఇచ్చింది. అయినా సరే ఆడియన్స్ ఆమెను సేవ్ చేయలేదు.
ఇక ఈ వారం రోహిణితో పాటు మరో ఎలిమినేషన్ కూడా ఉంటుందని చెప్పేశారు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం హౌస్ నుంచి నేడు వెళ్లబోయే కంటెస్టెంట్ విష్ణు ప్రియ అని తెలుస్తుంది. నబీల్, విష్ణు ప్రియలు చివరి దాకా వెళ్లి.. విష్ణు ప్రియని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. యాంకర్ గా బయట మంచి ఫాలోయింగ్ ఉన్న విష్ణు ప్రియ ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. ఐతే ఆమె ఆట కన్నా హౌస్ లో పృధ్వితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది. ఆ ఎఫెక్ట్ పృధ్వి ఆట మీద పడింది.
ఫైనల్ గా విష్ణు ప్రియ అంతగా ఆట కూడా ఆడకుండా టాప్ 5కి వెళ్తుందా అనుకున్నారు. కానీ ఆమె ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అవుతుంది. ఇక ఈ సీజన్ టాప్ 5 గా అవినాష్, నిఖిల్, గౌతం, ప్రేరణ, నబీల్ ఉన్నారు. టైటిల్ ఫైట్ మాత్రం నిఖిల్, గౌతం ల మధ్య జరుగుతుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది ముందే గెస్ చేయడానికి ఛాన్స్ లేదన్నట్టుగా నడుస్తుంది.