Begin typing your search above and press return to search.

ఆయ‌న బాదుడికి ప‌ర్పెక్ట్ బీజీఎమ్ బాస్!

'దేవ‌ర' బీజీఎమ్ మారు మ్రోగుతుంది. అయితే ఇప్పుడా బీజీఎమ్ స్టార్ ప్లేయ‌ర్ రొహిత్ శ‌ర్మ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానూ మారిపోయింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 10:35 AM GMT
ఆయ‌న బాదుడికి ప‌ర్పెక్ట్ బీజీఎమ్ బాస్!
X

`జైల‌ర్` త‌ర్వాత `దేవ‌ర` తో మ‌రోసారి అనిరుద్ బీజీఎమ్ సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. `దేవ‌ర‌`లో బీజీఎమ్ అద‌ర‌గొట్టాడు? అంటూ తొలి షో అనంత‌రం వ‌చ్చిన టాక్ అది. సినిమా లో కంటెంట్ కంటే? అనిరుద్ బీజీఎమ్ కోస‌మైనా సినిమా చూడొచ్చు అని ఓ వ‌ర్గం బ‌య‌ట గ‌ట్టిగానే ప్ర‌చారం చేసింది. అనిరుద్ బీజీఎమ్ కి తెలుగు ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అయిపోయారు. అంత‌వ‌ర‌కూ త‌మిళ్ నుంచే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చేది.

తెలుగు సినిమాలు అప్ప‌టికే కొన్ని చేసినా క‌లిసి రాలేదు. కానీ `దేవ‌ర` తో ఓ ఊపు ఊపేసాడు. ఇప్పుడెక్క‌డ చూసినా `దేవ‌ర` బీజీఎమ్ మారు మ్రోగుతుంది. అయితే ఇప్పుడా బీజీఎమ్ స్టార్ ప్లేయ‌ర్ రొహిత్ శ‌ర్మ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానూ మారిపోయింది. రోహిత్ శ‌ర్మ న్యూజిలాండ్ టూర్ కి రెడీ అవుతున్నాడు. కొంత గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. టెస్టుల్లోకి బ‌రిలోకి దిగుతున్నాడు. ఈనేప‌థ్యంలో నెట్స్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.

తాజాగా ఆ ప్రాక్టీస్ వీడియోకి దేవ‌ర బీజీఎమ్ ని జోడించారు. రెడ్ సీ బీజీఎమ్ ని యాడ్ చేయ‌డంతో అది వైర‌ల్ గామారింది. దీంతో రోహిత్ అభిమానులు తెగ క‌నెక్ట్ అవుతున్నారు. అటు తార‌క్ ఫ్యాన్స్ అంతే ఎంజాయ్ చేస్తున్నారు. తార‌క్ న‌ట‌న‌లో హీరో అయితే...రోహిత్ క్రికెట్ లో హీరో! ఇద్ద‌రు హీరోలు అద‌ర‌గొట్ట‌డం అద్భుతం అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. మ‌రి ఈ బీజీఎమ్ పాన్ ఇండియాలో ఇంకా ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట్అవుతుందో చూడాలి.

గ‌తంలో `పుష్ప` సినిమాలో పాట‌లు పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ లోనే సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. విదేశీ క్రికెట‌ర్లు సైతం శ్రీవ‌ల్లి పాట‌ల‌కు స్టెప్పులేసారు. ఎంతో మంది ఆట‌గాళ్లు స్పెష‌ల్ గా రీల్స్ కూడా చేసారు. తాజాగా దేవ‌ర బీజీఎమ్ ని సీరియ‌స్ ఎమోష‌న్స్ బ్యాక్ గ్రౌండ్ లో వేసుకుంటే అదిరిపోతుంది. సిచ్వేష‌న్ కి ప‌ర్పెక్ట్ గా సింక్ అవుతుంది.