ముంబై కమీషనర్ కింగ్ స్టోరీ 45 రోజుల్లోనే!
బాలీవుడ్ లో కాప్ స్టోరీలకు పెట్టింది పేరు రోహిత్ శెట్టి. పోలీస్ యాక్షన్ స్టోరీలు తీయడంలో రోహిత్ స్పెషలిస్ట్ అన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 24 Feb 2025 5:30 AM GMTబాలీవుడ్ లో కాప్ స్టోరీలకు పెట్టింది పేరు రోహిత్ శెట్టి. పోలీస్ యాక్షన్ స్టోరీలు తీయడంలో రోహిత్ స్పెషలిస్ట్ అన్నది తెలిసిందే. `సింగం`తో మార్కెట్ లో ఓ బ్రాండ్ అయ్యాడు. తొలి సినిమా `జమీన్` తోనే అతడిలో యాక్షన్ లెవ్ అర్దమైంది. అటుపై కొన్ని ప్రయత్నాలు చేసినా? అవేవి తీసుకురాని ఇమేజ్ యాక్షన్ స్టోరీలు ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొచ్చాయి. అతడి కెరీర్ లోనే `సింగం` అన్నది ఓ మైల్ స్టోన్ ప్రాంచైజీ.
అయితే ఇంత వరకూ రోహిత్ రియల్ యాక్షన్ స్టోరీల జోలికి వెళ్లింది లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శెట్టి ఓ సంచలన కమీషర్ బయోపిక్ కి సిద్దమవుతున్నాడని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగు తోంది. ముంబై మాజీ పోలీస్ కమీషనర్ రాకేష్ మరియా జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతలు తీసుకు న్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో జాన్ అబ్రహం నటిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సర్వం సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన నేపథ్యంలో మార్చి నుంచి రెగ్యులర్ షూటలింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే షూటింగ్ అంతా కేవలం 45 రోజుల్లోనే ముగించనున్నారుట. అంటే షూటింగ్ కోసం రోహిత్ ఎక్కువగా సమయం తీసుకోవడం లేదు. ఇంత వరకూ ఆయన ఏ సినిమా షూటింగ్ కూడా 45 రోజుల్లో పూర్తి చేయలేదు. ఆ రకంగా తొలిసారి రోహిత్ ఖాతలో ఇదో అరుదైన రికార్డు అని చెప్పాలి. పోస్ట్ ప్రొడక్షన్ అనంతరం సినిమా రిలీజ్ కి పెద్దగా సమయం తీసుకోరని తెలుస్తోంది.
రాకేష్ మారియా విషయాలోకి వెళ్తే...ఒకప్పుడు ముంబైని కంట్రోల్ చేసిన గ్రేట్ కమీషనర్ గా రాకేష్ కి పేరుంది. 1993లో జరిగిన వరుస బాంబు కేసుల దాడిని చేధించిన సక్సెస్ ట్రాక్ ఉంది.1981 నుంచి 2017 వరకూ పోలీస్ దళంలో తనదైన మార్క్ వేసారు రాకేష్. ముంబై మాఫియాని సైతం గడగడలాడించిన ట్రాక్ రికార్డు రాకేష్ కి ఉంది. పేరు మోసిన గ్యాంగ్ స్టర్లను జైళ్లలో పెట్టి మక్కలు ఇరగదీసిన ఘనడు. రాజకీయ ఒత్తిడులకు తలొంచకుండా పనిచేసిన చరిత్ర రాకేష్ ది. తప్పు చేసిన వాడి తాట తీయడమే రాకేష్ సార్ రూలింగ్ లో నడించింది.