ఫ్యాషన్ డిజైనర్ వెంటిలేటర్‌పై క్రిటికల్
8 మే 1961న శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్ బాల్ 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన కెరీర్‌ను ప్రారంభించాడు
By: Tupaki Desk | 29 Nov 2023 12:30 PM GMTప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (62) ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారు. CE ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గుండె సంబంధిత సమస్యల కారణంగా NCR మెదాంత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి క్లిష్టంగా మారిందని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. సుమారు 13 సంవత్సరాల క్రితం (2010లో) భారీ గుండెపోటుకు గురైన అతడి హార్ట్ కండిషన్ నానాటికి దిగజారిందని దీంతో వెంటిలేటర్‌పై ఉన్నట్లు కథనాలొస్తున్నాయి.
రోహిత్ బాల్ మద్యసేవనం పర్యవసానంగా ఆరోగ్య సమస్యలు పునరావృతం అయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో రోహిత్ బాల్ పరిస్థితి విషమించడంతో మేదాంత ఆసుపత్రిలో చేరారు. అతడు చాలా క్టిష్ఠ స్థితిలో ఉన్నాడు. నవంబర్‌లోనే అతడు దాదాపు చనిపోయాడు. అతని స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు వైద్యులు అతని సిస్టమ్ (కడుపు) నుండి మద్యం, నిద్ర మాత్రలను తొలగించవలసి వచ్చింది! అని రోహిత్ బాల్ సన్నిహితుడు ఒకరు జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. సుమారు 6-7 నెలల క్రితం తన సన్నిహిత మిత్రుడు లలిత్ తెహ్లాన్‌తో అతడు తన సమస్యల గురించి ప్రస్థావించారు. రోహిత్ బాల్ ఫిబ్రవరి 2010లో గుండెపోటుకు గురైనప్పుడు అత్యవసర యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. తాజాగా అందిన కథనాల ప్రకారం రోహిత్ పాత స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అతడిని ఆస్పత్రిలో సందర్శించారు.
8 మే 1961న శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్ బాల్ 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆర్చిడ్ ఓవర్సీ లిమిటెడ్ లో తన సోదరుడితో కలిసి 1990 కాలం నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ లో రాణించారు. సొంత ఫ్యాషన్ కలెక్షన్స్ ని ప్రారంభించారు. రోహిత్ బాల్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల పూర్వ విద్యార్థి. అతను ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ విద్యను అభ్యసించాడు. అతడు బాలీవుడ్ తో గొప్ప అనుబంధం కలిగి ఉన్నాడు.