టీజర్: రోహిత్ మార్క్ ఇండియన్ పోలీస్ ఫోర్స్
పెను ప్రమాదాలు కుట్రల నుంచి ప్రజల్ని కాపాడే పోలీసుల కింకర్తవ్యంపై ఈ సిరీస్ తెరకెక్కిందని అర్థమవుతోంది.
By: Tupaki Desk | 16 Dec 2023 9:53 AM GMTసిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఆనంద్ ఒబెరాయ్, శిల్పాశెట్టి కుంద్రా నటించిన హిందీ వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ నుండి అధికారిక టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం దుష్ఠ శక్తుల కుట్రలు కుతంత్రాలు నగరాల్లో మారణ హోమాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. పెను ప్రమాదాలు కుట్రల నుంచి ప్రజల్ని కాపాడే పోలీసుల కింకర్తవ్యంపై ఈ సిరీస్ తెరకెక్కిందని అర్థమవుతోంది. టీజర్ ఆద్యంతం రోహిత్ శెట్టి మార్క్ హీరోయిజం ఎలివేషన్లు ఆకట్టుకుంటున్నాయి.
గోల్‌మాల్, సింగం, సూర్యవంశీ, ఆల్ ది బెస్ట్ వంటి భారీ హిట్‌లతో పాపులరైన దర్శకనిర్మాత రోహిత్ శెట్టి `ఇండియన్ పోలీస్ ఫోర్స్`తో OTT రంగంలోకి ప్రవేశిస్తున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి కుంద్రా , వివేక్ ఒబెరాయ్ లాంటి భారీ తారాగణంతో ఈ షో రూపొందింది. కాప్ విశ్వంలో తదుపరి అధ్యాయంగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ గురించి ప్రచారం సాగుతోంది.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ కథాంశం:
ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో విధ్వంశాలతో టీజర్ ప్రతి ఫ్రేమ్‌లో ఉత్కంఠను పెంచింది. భారీ పేలుళ్లకు దారితీసే టిక్కింగ్ బాంబు గడియారం పని తీరు ఏమిటన్నది సస్పెన్స్ ఎలిమెంట్. రానున్న ప్రమాదం గురించి హెచ్చరిక అందగానే, కాప్ డ్రామాలో సాహసోపేతమైన హీరోల ప్రవేశంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారులను ఎదుర్కొనే పోలీసులు.. భయంకరమైన బెదిరింపుల నుండి నగరాన్ని రక్షించడానికి ధైర్యంగా ప్రతి ఎటాక్ కి దిగే పోలీసులు, వారి దేశభక్తి స్ఫూర్తిని రగిలించేలా తెరపై ఆవిష్కరించారు.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ 19 జనవరి 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాల్లో ప్రదర్శితం కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి కుంద్రా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, నికితిన్ ధీర్, ముఖేష్ రిషి, శ్వేతా తివారీ, రితురాజ్ సింగ్, లలిత్ పరిమూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్ శెట్టి -సుశ్వంత్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ దేశవ్యాప్తంగా భారతీయ పోలీసు అధికారులు ప్రదర్శించే నిస్వార్థ అంకితభావం, అచంచలమైన నిబద్ధత, దేశభక్తికి హృదయపూర్వక నివాళిగా ప్రచారం సాగుతోంది. పోలీసులు అత్యంత అంకితభావంతో ప్రజల భద్రతకు భరోసా ఇస్తూ తమ విధినిర్వహణతో ఆశ్చర్యపరుస్తారు. దీనిని రోహిత్ శెట్టి పిక్చర్స్ - రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి నిర్మించారు.