ఫైనల్స్ కి ముందు పాకిస్తాన్ బ్యూటీ ఇలా బుక్కైందేంటి?
ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాతే అసలు సినిమా మొదలైంది.
By: Tupaki Desk | 24 Oct 2024 11:30 PM GMTఅందాల పోటీల్లో ఎలాంటి దుస్తుల్లోనైనా మోడల్స్ ర్యాంప్ వాక్ చేయోచ్చు. అలాగని హద్దులు మీరి ప్రవర్తిస్తే జ్యూరీ కామ్ గా ఉన్నా? జనాలు ఊరుకోరు కదా. అసలే సోషల్ మీడియా జమానా? ఏమాత్రం తేడా జరిగినా ఉతికారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మోడల్ అడ్డంగా బుక్కైంది. ర్యాంప్ వాక్ లో భాగంగా ఏకంగా అమ్మడు బికినీ దుస్తుల్లోనే వాక్ చేసింది. అక్కడంతా వ్యవహారం కామ్ గానే జరిగింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాతే అసలు సినిమా మొదలైంది.
నెట్టింట ఆ వీడియో వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాల్సి వచ్చింది. లాహోర్ కి చెందిన రొమా అనే మోడల్ ఈ పరిస్థితిని ఎదుర్కుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమ్మడు అటుపై మోడలింగ్ లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్యాషన్ డిజైనర్లు బ్రాండ్లకు పని చేస్తోంది. రెండు ఫీచర్ పిల్మ్స్ కూడా చేసింది. టెలివిజన్ ఛానెల్స్ పైనా మెరిసింది.
పాక్ తరుపున పలు అంతర్జాతీయ వేదికలపైనా మెరిసింది. కేన్స్ ప్యాషన్ వీక్..దుబాయ్ ఫ్యాషన్ వీక్ ల్లోనూ కనిపించింది. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లోనూ భాగమైంది. థాయ్ లాండ్ లో జరుగుతోన్న పోటీల్లో 69 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇది అక్టోబర్ 25న జరుగుతుంది. టైటిల్ విన్నర్ ని ప్రకటిస్తారు. ఈలోగా వివిధ పోటీలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలోనే బికినీ వేసి ర్యాంప్ పై వాక్ చేసి అబాసు పాలు అయింది. దీంతో నెటి జనులు వస్త్రా దారణపై దృష్టి పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. సాంస్కృతిక ప్రాతినిధ్యం వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఈ వీడియో చర్చకు తెర తీసింది. ఇదే పోటీలో భారత్ నుంచి రేచల్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది.