నటుడి సినిమా కష్టాలు ఇంత దారుణమా?
బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ టాలీవుడ్ కి సుపరిచితమే. `జైలవకుశ`..`లైగర్` లాంటి చిత్రాల్లో నటించాడు. హిందీ..బెంగాలీ భాషల్లో మాత్రం బాగా ఫేమస్ అయిన నటుడు.
By: Tupaki Desk | 12 Dec 2023 12:30 AM GMTబాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ టాలీవుడ్ కి సుపరిచితమే. `జైలవకుశ`..`లైగర్` లాంటి చిత్రాల్లో నటించాడు. హిందీ..బెంగాలీ భాషల్లో మాత్రం బాగా ఫేమస్ అయిన నటుడు. వెండి తెరతో పాటు బుల్లి తెరపైనా తనదైన ముద్ర వేసారు. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ రాణిస్తున్నారు. బాలీవుడ్ లో బిజీ నటుడైనా టీవీ సిరియల్స్ మాత్రం కంటున్యూ చేస్తోన్న ఏకైక నటుడిగాను రోనిత్ కి మంచి పేరుంది.
ఇక ఎదిగే క్రమంలో చాలా సవాళ్లు సైతం ఎదుర్కున్నారు. అసిస్టెంట్ డైటరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి నటుడయ్యారు. అటుపై అంచలంచెలుగా ఎదిగారు. ఇక ఇతగాడు కూడా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. మద్యం మానడానికి దానితో పెద్ద యుద్దమే చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. `రాత్రిపూట మందు తాగి ఉదయం షూటింగ్ కి వెళ్లేవాడిని. సక్సెస్ ని అర్దం చేసుకునేవాడిని కాదు.
దాని గురించి ఆలోచన కూడా చేసేవాడిని కాదు. ఎన్ని సినిమాలు చేసినా మద్యం మత్తులో నేనేం చేస్తున్నానో కూడా తెలిసేది కాదు. కానీ నేను చేయని తప్పు ఒకటుంది. ఎంత తాగినా ఏ రోజు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చాడు అని కంప్లైంట్ ఇచ్చింది లేదు. అంతే నిబద్దతతో సెట్స్ కి వెళ్లేవాడిని. కానీ నాకు మాత్రం ఆన్ సెట్స్ లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. షూటింగ్ కి నాలుగు గంటలు ముందు మద్యం తీసుకునేవాడిని.
నాకు నిద్ద పట్టేది కాదు. కళ్లు బయటకు వచ్చేసేవని అంతా చెప్పేవారు. నాతొలి సినిమా `జాన్ తేరే నామ్` 1992 లో రిలీజ్ అయింది. అది పెద్ద హిట్ అయింది. కానీ ఆరు నెలల వరకూ మళ్లీ నాకు ఫోన్ కాల్ రాలేదు. దీంతో ఓ ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగాన్ని మూడు సంవత్సరాల పాటు చేసాను. కొన్నాళ్లకి పని పూర్తయిం ది అని పంపించేసారు. దీంతో ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఎదురైంది. కారులోనే నిద్రపోయేవాడిని. పబ్లిక్ టాయిలెట్ లో స్నానం చేసేవాడిని. ఆ తర్వాత కొంత కాలానికి మెల్లగా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి` అని అన్నారు