సుమ వారసుడు.. మోగ్లీ ప్రేమ కథ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్, వినూత్న కథలు, ప్రత్యేకమైన సినిమాలతో కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
By: Tupaki Desk | 7 Sep 2024 11:40 AM GMTపీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్, వినూత్న కథలు, ప్రత్యేకమైన సినిమాలతో కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తోన్న మోగ్లీ సినిమాలో యువ హీరో రోషన్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
అడవి నేపథ్యంగా సాగే కాంటెంపరరీ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. సందీప్ రాజ్ గతంలో కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అప్పుడు చూపించిన భావోద్వేగాలున్న కథలను మరోసారి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. రోషన్ కనకాల ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే మొదట సినిమాలో ఫ్యాన్స్ తో పాటు సహజ నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న రోషన్, ఈ సినిమాలో కొత్త తరహా పాత్రతో అలరించనున్నాడు. నేడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రోషన్‌ను సింపుల్ వెస్ట్ ధరించి తన బలాన్ని ప్రదర్శిస్తూ, చార్మింగ్ స్మైల్ తో కనిపిస్తూ చూపిస్తుంది. ఈ పోస్టర్‌లో రోషన్ తోటీ ఉన్న గుర్రం మరియు దట్టమైన అడవి నేపథ్యంలో సాగే సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
జంగిల్ బుక్ లోని మోగ్లీ అనే పేరుతో ఈ కథ కూడా అడవి నేపథ్యంలోనే సాగుతుందని ఈ ఫస్ట్ లుక్‌తో తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రకు కూడా ముఖ్యత ఉంటుంది, అయితే విలన్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. సాంకేతికంగా కూడా ఈ చిత్రానికి అత్యున్నత ప్రతిభ ఉన్న టీమ్ పనిచేస్తోంది.
కలర్ ఫోటోకు సంగీతం అందించిన కాలా భైరవ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సహాయక కెమెరామెన్ గా పనిచేసిన రామ మారుతి ఎం ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే కలర్ ఫోటో, మేజర్ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2025 సమ్మర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.