గ్లింప్స్: కనకాల వారసుడి అడ్వెంచర్ లవ్
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా అడ్వెంచర్, లవ్ సినిమాగా రానుంది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.
By: Tupaki Desk | 14 Feb 2025 2:44 PM GMTటాలీవుడ్‌లో మరో విభిన్నమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు ఎంటర్టైన్మెంట్ వరల్డ్ సీనియర్ మోస్ట్ టాప్ యాంకర్ అయిన సుమ తనయుడు హీరోగా మౌగ్లీ 2025 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇదివరకే అతను ఒక సినిమా చేసినప్పటికి అదేమీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఈసారి ఎలాగైనా యాక్షన్ తో హిట్ కొట్టాలని జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తో కలిశాడు. ఇక నేడు బాటిల్ ఫర్ లవ్ బిగిన్స్ పేరుతో ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా అడ్వెంచర్, లవ్ సినిమాగా రానుంది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఈ సినిమాలో రోషన్ కనకాల పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘బబుల్‌గమ్’ సినిమాతో ఎమోషనల్ నటన చూపించిన రోషన్, ఈ సారి సరికొత్త అవతారంలో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా ద్వారా సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉండబోతుందనే టాక్ ఉంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో వేరే లెవల్‌లో ఉంది. ఓ నిశబ్దమైన అడవిలో తుపాకీ తయారుచేస్తున్న సీనుతో మొదలైన గ్లింప్స్ ఆసక్తిని రేపుతోంది. దర్శకుడు సందీప్ రాజ్ తుపాకీని సాక్షి చేతికి ఇవ్వడం, ఆమెలో కనిపించే కఠినత, ఆ తర్వాత రోషన్ ఎంట్రీతో టెన్షన్ పెరగడంతో ఈ సన్నివేశాలు సినిమాకు కొత్త హైప్ తెచ్చాయి. చివరగా షాట్ ఫైర్ అవ్వడం, ఆ వెంటనే స్క్రీన్ బ్లాక్ అవ్వడం సస్పెన్స్ క్రియేట్ చేసింది.
సైలెంట్ లవ్ స్టొరీలో ఒక భీకార యుద్ధం అంటూ హింట్ అయితే ఇచ్చారు. 8 నెలల రైటింగ్, 7 నెలల ప్రీ ప్రొడక్షన్, ఆరుగురు న్యూ ఏజ్ టెక్నీషియన్స్ అంటూ టీజర్ ను కొత్తగా ప్రజెంట్ చేశారు. కేవలం వాలెంటైన్స్ డే గ్లింప్స్‌తోనే సినిమాపై క్రేజ్ పెరిగింది. రోషన్ కనకాల పర్ఫార్మెన్స్, సాక్షి ఇన్టెన్సిటీ, కాళ భైరవ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సినిమా కేవలం రొమాన్స్‌కు పరిమితం కాకుండా, థ్రిల్, అడ్వంచర్ అంశాలతో ఆకట్టుకునేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీకి రామ మరుతి ఎం, ఎడిటింగ్‌కు కోడాటి పవన్ కళ్యాణ్, యాక్షన్ కోసం నటరాజ్ మడిగొండ లాంటి ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి, వాలెంటైన్స్ డే గ్లింప్స్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సందీప్ రాజ్ టేకింగ్, రోషన్ కనకాల కొత్త అవతారం, సాక్షి సాగర్ రోల్ ఈ మూడూ అంశాలు కలసి ‘మౌగ్లీ 2025’ సినిమాకు విభిన్నమైన హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.