సుమ వారసుడు.. ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నాడు
టాలీవుడ్‌లో ఈమధ్య కుర్ర హీరోలు చిన్న బడ్జెట్ లోనే మొదలైన బాక్సాఫీస్ వద్ద ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 15 March 2025 12:58 PM ISTటాలీవుడ్‌లో ఈమధ్య కుర్ర హీరోలు చిన్న బడ్జెట్ లోనే మొదలైన బాక్సాఫీస్ వద్ద ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అదే ట్రాక్ లో మరో ఆసక్తికరమైన ప్రయోగాత్మక చిత్రంగా మౌగ్లీ 2025 వస్తోంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల ఈ సినిమాతో తన కెరీర్‌లో కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాడు. బబుల్‌గమ్ సినిమా ద్వారా యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న రోషన్, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నాడు.
జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తోనే సరికొత్త హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రోషన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ లో అతను ఫైరీ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. సినిమా టైటిల్ మౌగ్లీ 2025 అన్నప్పటికీ, ఇది అడవిలో మాత్రమే నడిచే కథ కాదని, దీని వెనుక ఓ గొప్ప యాక్షన్ డ్రామా ఉందని పోస్టర్ స్పష్టంగా చెప్పకనే చెప్పింది. చేతికి రఫ్ లుక్ ఉన్న గ్లౌజ్, మెడలో తాడు, ఫిట్ బాడీ లాంగ్ హెయిర్ స్టైల్ తో రోషన్ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్లు కనపడింది.
అతని వెనుక సైనికులు కనిపించడం, వారసత్వ పోరాటాన్ని సూచించనట్లు ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కొత్తదనంతో మిళితమై ఉంటుందని టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆమె ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం మరో విశేషం. అతని మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. రోషన్ నటన, సందీప్ రాజ్ టేకింగ్, కాలభైరవ సంగీతం అన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచునున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ మరో బిగ్ హిట్ కొట్టేందుకు వస్తున్నాడు. కథ, టెక్నికల్ టీమ్, గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి.
రోషన్ తన డెబ్యూట్ చిత్రంలో లవ్ స్టోరీ చేసినప్పటికీ, ఈసారి పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చూసిన లవ్ స్టోరీల కంటే మౌగ్లీ 2025 మాస్, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్ కలిపిన భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వస్తే, సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.