కొడుకుని ఈ రేంజ్ లో సానబెట్టారా?
ఫేమస్ యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 29 Dec 2023 7:14 AM GMTఫేమస్ యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇద్దరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రోషన్ హీరోగా మ్యాకప్ వేసుకున్నాడు. చిన్న నాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణమే కాబట్టి! అదే రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు. కెరీర్ ఇప్పుడే మొదలైంది కాబట్టి! ఇంకా అతడు తెలుసుకోవాల్సి...నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.బ్యాకెండ్ లో బ్యాకప్ ఉంది కాబట్టి రోషన్ కి కొన్నాళ్ల పాటు అవకాశాలు అందుకోగల్గుతాడు. ఆ తర్వాత అంతా ట్యాలెంట్ పైనే ఎదగాల్సి ఉంటుంది. మరి రోషన్ కెరీర్ ఎలా సాగుతుందన్నది చూడాలి.
ఈ నేపథ్యంలో తన బాల్యం గురించి రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.' నా బాల్యం అంతా తాతయ్య దేవదాస్ కనకాల యాక్టింగ్ ఇనిస్ట్యూట్ లోనే గడిచంఇంది. కింద అందస్తులో ఇనిస్ట్యూట్ ..మేడపైనా మేము ఉండేవాళ్లం. ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ చిన్న నాటినుంచి సినిమాలంటే ఆసక్తి పెరిగింది. సినిమాని ముందుకు తీసుకెళ్లే హీరో అవ్వాలనుకున్నాను. తాతయ్య దగ్గర రెండు నెలలు పాటు ట్రైనింగ్ తీసుకున్నా. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లాసె ఏంజిల్స్ లో యాక్టింగ్ కోర్స్ చేసాను.
అలాగే పాండిచ్చేరి ఇనిస్ట్యూట్ లో కొంతట్రైనింగ్ తీసుకున్నా. అదంతా ఇప్పుడు ఉపయోగపడుతున్నదే.నేనెప్పుడు పోటీ గురించి ఆలోచించలేదు. సినిమాల్లో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపైనే ఫోకస్ పెట్టాను. హీరోగా నిలబడతానా? లేదా? అనే దానికంటే ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అమ్మ నాన్న ఇద్దరు నటులు. ఎలాంటి డౌట్ వచ్చినా వాళ్లను అడుగుతాను.
చిరంజీ విసర్..నాగార్జున సర్ కలిసాను. వాళ్ల అనుభవాలు పంచుకుంటూ ప్రోత్సహించారు' అని అన్నాడు. మొత్తానికి సుమ-కనకాల కుమారుడు తెరంగేట్రానికి ముందే బాగానే సానబెట్టినట్లు కనిపిస్తుంది. సొంత ఇనిస్ట్యూట్ ఉండటంతో పాటు ప్రత్యేకంగా విదేశాల్లోనూ ట్రైన్ చేయడం అన్నది తల్లిదండ్రుల ఆసక్తిని తెలియజేస్తుంది.