Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ కొడుకు సినిమా ఆగిపోయిందా?

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్.. ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Dec 2024 2:45 AM GMT
శ్రీకాంత్ కొడుకు సినిమా ఆగిపోయిందా?
X

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్.. ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన టాలెంట్ తో అలరిస్తున్నారు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. బడా హీరోల చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారి.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అయితే శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రుద్రమదేవి మూవీలో చైల్ట్ ఆర్టిస్ట్ గా కనిపించిన రోషన్.. 2016లో నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మారారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన పెళ్లి సందD చిత్రంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

ఆ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయినా.. రోషన్ లుక్స్ అండ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ మూవీలో నటించిన శ్రీలీల ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు రోషన్ ఛాంపియన్ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ మొదలైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఆ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు రోషన్.. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ మూవీ వృషభలో నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. రోషన్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఆ సినిమా మేకర్స్ తెలిపారు.

2024లో రిలీజ్ అవుతుందని చెప్పినా.. ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఆ సినిమా ఆగిపోయిందట. ఈ మేరకు నటుడు శ్రీకాంత్.. తన అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో చెప్పారు. మొదటి షెడ్యూల్ తోనే మూవీ నిలిచిపోయిందని, షూటింగ్ మరి జరగడం లేదని తెలిపారు.

అయితే వృషభ మూవీ.. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే ఇంటెన్స్ డ్రామాగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ అప్పుడు తెలిపారు. మోహన్ లాల్, రోషన్.. తండ్రీకొడుకులుగా కనిపించనున్నట్లు చెప్పారు. ఓ మంచి విజువల్ వండర్ అవుతుందని అంచనాలు క్రియేట్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో రోషన్ మంచి ఛాన్స్ అందుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ నిలిచిపోయిందని శ్రీకాంత్ చెప్పడంతో ఇప్పుడు షాకవుతున్నారు.