Begin typing your search above and press return to search.

రోషన్.. ఆ సీన్ తో షాక్ ఇచ్చేలా..

తప్పకుండా సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుంది అని రోషన్ ఎంతో నమ్మకంగా కనిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 1:40 PM GMT
రోషన్.. ఆ సీన్ తో షాక్ ఇచ్చేలా..
X

యాంకర్ సుమ వారసుడు రోషన్ కనకల హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. బబుల్ గమ్ అనే ఆ కొత్త చిత్రం ఇప్పటికే సాంగ్స్ తో అలాగే ప్రమోషనల్ ఈవెంట్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై కొంత హైప్ అయితే క్రియేట్ చేసింది. తప్పకుండా సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుంది అని రోషన్ ఎంతో నమ్మకంగా కనిపిస్తున్నాడు.

ఇటీవల అతను ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై వచ్చే నెగటివ్ ట్రోల్స్ కామెంట్స్ పై కూడా రోషన్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సరికొత్త అనుభూతితో థియేటర్లో నుంచి బయటకు వస్తారు అని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని ముఖ్యంగా షర్ట్ లెస్ తో వచ్చే ఒక సన్నివేశం కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని తెలియజేశాడు.

షర్ట్ లెస్ సీన్‌ ను షూట్ చేసిన అనుభవం మరచిపోలేనిదని, దాదాపు మూడు గంటల పాటు చొక్కా లేకుండా షూట్ లో పరిగెట్టాల్సి వచ్చిందని, ఆ సీన్ చాలా ఏమోషన్ తో కూడా హైలెట్ అవుతుందని రోషన్ తెలిపాడు. ఇక ఈ సినిమాలో ఇజ్జత్ అనే పాట కూడా బాగా ట్రెండ్ అవుతోంది అలాగే మిగిలిన సాంగ్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి అని రోషన్ వివరణ ఇచ్చాడు.

సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు అని టెక్నీషియన్స్ కూడా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా రోషన్ వివరణ తెలిపారు. బ్లాక్‌బస్టర్ చిత్రం "క్షణం" దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, మానస చౌదరి కథానాయికగా నటించింది.

ఇక 'బబుల్‌గమ్' యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ నిర్మించిన 'బబుల్‌గమ్' డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రోషన్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.