Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భామతో శ్రీకాంత్ కొడుకు.. ఏంటి కథ?

అయితే తాజాగా రోషన్​-షనయ కపూర్ కలిసి కెమెరా కంటికి చిక్కారు. ఈ ఇద్దరు ముంబయిలో కనిపించారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:30 AM GMT
బాలీవుడ్ భామతో శ్రీకాంత్ కొడుకు.. ఏంటి కథ?
X

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉన్న హీరో. ఆయన ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా వృషభ అనే సినిమా చేయబోతున్నారు. ది వారియర్ అరైజ్ ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, సంజయ్ కపూర్ కూతురు బాలీవుడ్ బ్యూటీ షనయ కపూర్‌ వంటి స్టార్ కిడ్స్​ కూడా నటిస్తున్నారు. ఇంకా జహ్రా ఖాన్ సహా మరికొంతమంది ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజాగా రోషన్​-షనయ కపూర్ కలిసి కెమెరా కంటికి చిక్కారు. ఈ ఇద్దరు ముంబయిలో కనిపించారు. దీంతో కెమెరామెన్లు వారిద్దరిని క్లిక్ మనిపించారు.ఇద్దరూ నవ్వుతూ పోజులిచ్చారు. ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా కనిపించింది. సినిమాలోనూ ఈ ఇద్దరు జంటగా నటించబోతున్నారు. ఆఫ్ స్క్రీన్లో ఎంతో క్యూట్ పెయిర్​గా కనిపించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ ముంబయిలో రీసెంట్​గా షురూ అయింది. ఇందులో భాగంగానే షనయ కపూర్​ - రోషన్ కనిపించారు. మరో విషయమేమిటంటే.. రోషన్, షనయ జోడీకి ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే... శ్రీకాంత్ హీరోగా గతంలో నటించిన పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అయిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమా హిందీ రీమేక్ మేరే సప్నోం కి రాణిలో సంజయ్ కపూర్ హీరోగా నటించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లలు జంటగా నటించడమే విశేషం. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను తెలుగు, మలయాళీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. హాలీవుడ్ టెక్నిషియన్ సినిమా కోసం పనిచేస్తున్నారు. సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందించబోతున్నారు.