Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్, దేవర, గేమ్ ఛేంజర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 11:30 PM GMT
ఆర్ఆర్ఆర్, దేవర, గేమ్ ఛేంజర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
X

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. సినిమాలో తమ యాక్టింగ్ తో వేరే లెవెల్ లో మెప్పించారు. నేషనల్ వైడ్ గా పాపులారిటీ పెంచుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. అదే సమయంలో అందరి దృష్టి వారి అప్ కమింగ్ మూవీస్ పై పడింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్.. రీసెంట్ గా దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలోనూ సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

తారక్ కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రం(నాన్ ఆర్ఆర్ఆర్)గా దేవర నిలిచింది. ఫస్ట్ వీకెండ్ కల్లా రూ.304 కోట్లు వసూలు చేసిన దేవర మూవీ.. సినిమా బడ్జెట్ లో 80 శాతానికి పైగా ఇప్పటికే రికవరీ చేసేసింది. తారక్ యాక్షన్, కొరటాల మాస్ పల్స్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ వర్క్.. సినిమాకు బిగ్గెస్ట్ అసెట్స్ గా మారాయి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన సినిమాతో ఎన్టీఆర్ సాలిడ్ హిట్ అందుకున్నట్లే.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న మూవీ కూడా ఇదే కావడంతో ఎలాంటి హిట్ అవుతుందోమోనని అంతా మాట్లాడుకుంటున్నారు. దేవరలా మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేస్తుందా లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, తారక్ చేసిన సినిమాలు కాస్త గ్యాప్ లో రిలీజ్ కావడంతో.. సినీ ప్రియులు కచ్చితంగా వసూళ్లను కంపేర్ చేస్తారు.

అయితే గేమ్ ఛేంజర్ ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. రీసెంట్ గా ఆయన తీసిన భారతీయుడు-2 ఫ్లాప్ గా మారింది. అంతకుముందు ఆయన చేసిన పలు సినిమాలు కూడా మెప్పించలేకపోయాయి. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తమన్ తన మ్యూజిక్ వర్క్ తో మూవీపై బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉంటుందో.. ఎంతటి వసూళ్లు రాబడుతుందో.. దేవర వసూళ్ల కౌంట్ ను రిపీట్ చేస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.