Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్‌' కోసం రామరాజు పబ్లిసిటీ

గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదల సమయంలో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కావడం వల్ల అదనపు బలం చేకూరినట్లు అయ్యింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:30 AM GMT
గేమ్‌ ఛేంజర్‌ కోసం రామరాజు పబ్లిసిటీ
X

రామ్‌ చరణ్‌ గత కొన్ని రోజులుగా 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయన గతంలో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌ : బిహైండ్ అండ్ బియాండ్' కి మంచి స్పందన వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అనుభవాలను షేర్‌ చేసుకుంటూ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు మాట్లాడటం, కొన్ని మేకింగ్‌ సీన్స్‌, ఆస్కార్‌ అవార్డ్‌ వరకి ప్రయాణం ఇలా చాలా విషయాలను ఈ డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. రాజమౌళి తన మాస్టర్‌ మైండ్‌తో సినిమాను ఎలా రూపొందించారు అనే విషయాన్ని అందులో క్లీయర్‌గా చూపించడం జరిగింది.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదల సమయంలో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కావడం వల్ల అదనపు బలం చేకూరినట్లు అయ్యింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రామ్‌ చరణ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. రామరాజు పాత్రలో చరణ్ నటించిన తీరు, లుక్ ఇలా అన్ని విషయాల గురించి పలు భాషల ప్రేక్షకులు మాట్లాడుతూ ఉన్నారు. దాంతో గేమ్‌ ఛేంజర్‌ సినిమా గురించి చర్చ వస్తుంది. అందువల్ల ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ వల్ల గేమ్‌ ఛేంజర్‌కి అదనంగా ప్రమోషన్‌ దక్కినట్లు అవుతుంది అంటూ కొందరు మీడియా వర్గాల వారు, సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం పెద్ద ఎత్తున యూనిట్‌ సభ్యులు మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి తోడు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పబ్లిసిటీ కూడా అదనంగా చేరింది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం ఎదురు చూసే విధంగా చేసింది. అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ ఈ సమయంలో రావడం మంచిది అయ్యింది అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

రామ్‌ చరణ్ సోలో హీరోగా సినిమాతో వచ్చి దాదాపు నాలుగు ఏళ్లు అవుతోంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా కాలం తర్వాత రామ్‌ చరణ్‌ ఈ సినిమాతో సోలో హీరోగా రాబోతున్నాడు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌లుగా అంజలి, కియారా అద్వానీ నటించారు. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్‌ అందించిన సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.