బాహుబలి 2 తర్వాత RRRకే ఈ ఘనత
11 మే 2025న రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రదర్శితమవుతుందని టీమ్ ప్రకటించింది.
By: Tupaki Desk | 3 Nov 2024 5:45 AM GMTప్రతిష్ఠాత్మక లండన్ రాయల్ ఆల్బర్ట్ థియేటర్ లో ఒక సినిమాని ప్రదర్శించడం అంటే అది కచ్ఛితంగా ఎంతో గొప్ప సినిమా అయితేనే కానీ సాధ్యం కాదు. కానీ అలాంటి అవకాశం మన జక్కన్న సినిమాకి వచ్చింది. అది బాహుబలి 2తో సాధ్యమైంది. ఐదు సంవత్సరాల క్రితం 19 అక్టోబర్ 2019న దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలి: ది కన్‌క్లూజన్ 148 సంవత్సరాల చరిత్రలో లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించబడిన మొట్టమొదటి ఆంగ్లేతర చిత్రంగా చరిత్ర సృష్టించింది. 5 సంవత్సరాల తర్వాత రాజమౌళి ఈసారి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన యాక్షన్ డ్రామా RRRతో మరోసారి ఈ ఫీట్ ని రిపీట్ చేస్తున్నాడు.
11 మే 2025న రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రదర్శితమవుతుందని టీమ్ ప్రకటించింది. ఆస్కార్-విజేత సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి ఈ లైవ్ ఫిల్మ్-ఇన్-కాన్సర్ట్ ప్రదర్శన కోసం ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ప్రదర్శన ఇవ్వనున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సంచలన చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ తదితరులు నటించారు. 25 మార్చి 2022న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. DVV దానయ్య నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సుమారు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్లోబల్ చార్ట్‌బస్టర్ నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్స్ సహా పలు అంతర్జాతీయ పురస్కారాలను ఆర్.ఆర్.ఆర్ గెలుచుకుంది.