Begin typing your search above and press return to search.

RRR కలెక్షన్లు.. కొత్త అనుమానాలు?

ఆర్ఆర్ఆర్.. ఈ ఒక్క సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా ఏంటో చూపించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:45 AM GMT
RRR కలెక్షన్లు.. కొత్త అనుమానాలు?
X

ఆర్ఆర్ఆర్.. ఈ ఒక్క సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా ఏంటో చూపించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రాకతో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా ఖ్యాతి ఇంతకింత పెరిగింది. ఇందులోని క్యారెక్టర్లతో పాటు ఆ పాత్రలు చేసిన నటీనటులకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో జక్కన్న పేరు కూడా మారుమోగిపోయింది.

అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసిందని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. ట్రేడ్ వర్గాలు కూడా అదే విషయాన్ని చెప్పాయి. కానీ మొత్తం వసూళ్ల సంఖ్యపై అప్పట్లో అనేక డౌట్లు వచ్చాయి. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా రూ.1150 కోట్ల వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెప్పారు.

ఆ తర్వాత జపాన్ లో రీరిలీజ్, యూఎస్ లో స్పెషల్ షోల ద్వారా సుమారు రూ.100 కోట్ల రాబట్టింది. దీని బట్టి చూస్తే ఈ సినిమా వసూళ్లు రూ.1250 కోట్లుగా చెప్పొచ్చు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి చాలా రోజులైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వచ్చి పోయాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు వికీపీడియాలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1387 కోట్లు వసూలు చేసినట్లు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ఈ సినిమా కలెక్షన్ల సంఖ్యను చూసి సినీప్రియులు ఖంగుతింటున్నారు. ఒక్కసారిగా రూ.130 కోట్లకుపైగా ఎలా పెరిగిందని ఆలోచిస్తున్నారు.

అయితే వికీపీడియాలో ఈ సినిమా వసూళ్లను ఎవరూ మార్చుతున్నారో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. అసలు ఈ సినిమా మొత్తం ఎంత వసూలు చేసిందో తెలియట్లదేనని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

కొమురం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ఆర్ఆర్ఆర్‌. అలియా భట్‌ సీతగా కనిపించింది. అజయ్దేవగణ్, శ్రియ, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫిక్షనల్ కథతో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను గ్రాండ్గా తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ ముందు సరికొత్త రికార్డులు సృష్టించింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సాధించింది.