హృతిక్ తర్వాత గ్రీక్ గాడ్ ఈ టాలీవుడ్ హీరో
భారతదేశంలో గ్రీక్ గాడ్ అనే ప్రశంస అందుకున్న ఏకైక హీరో హృతిక్ రోషన్. అతడి తీరైన లుక్‌కి దక్కిన బిరుదు ఇది.
By: Tupaki Desk | 31 Dec 2024 8:30 PM GMTభారతదేశంలో గ్రీక్ గాడ్ అనే ప్రశంస అందుకున్న ఏకైక హీరో హృతిక్ రోషన్. అతడి తీరైన లుక్‌కి దక్కిన బిరుదు ఇది. 6 ప్యాక్ మెలితిరిగిన కండలతో అద్భుతమైన రూపం కోసం హృతిక్ ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు జిమ్ లోనే శ్రమిస్తాడని చెబుతుంటారు. హృతిక్ స్ఫూర్తితో నేటి జెన్ -జడ్ యూత్ జిమ్ముల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మళ్లీ హృతిక్ తర్వాత గ్రీక్ గాడ్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు హీరో రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలోని `గేమ్ ఛేంజర్`లో అతడు చొక్కా విప్పి ప్రదర్శించే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీక్వెన్స్ లో చరణ్ 6 ప్యాక్ యాబ్స్ తో మెస్మరైజ్ చేస్తాడని చెబుతున్నారు ఫిలిం ఎడిటర్ రూబెన్. తాజాగా సోషల్ మీడియాలో చరణ్ సిక్స్ ప్యాక్ లుక్ కి సంబంధించిన ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసిన `గేమ్ ఛేంజర్` ఎడిటర్ రూబెన్ చిత్రకథానాయకుడు చరణ్ రూపంపై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ గ్రీక్ గాడ్ లుక్ ఇది అంటూ అతడు మెగాభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాడు.
చరణ్- శంకర్ కాంబినేషన్ లో రూపొందిన `గేమ్ ఛేంజర్` జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసేది ఎడిటర్ రూబెన్ కాబట్టి అతడి మాటలు ప్రజల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయి. జవాన్, పుష్ప- 1 కి అతడే ఎడిటర్ గా పని చేసారు. ఆ రెండూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అదే తీరుగా గేమ్ ఛేంజర్ విజయంపైనా అతడు ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఎక్స్ ఖాతాలో గేమ్ ఛేంజర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర అప్ డేట్స్ ని ఎడిటర్ రూబెన్ అందిస్తున్నారు.
రామ్ చరణ్ సిక్స్-ప్యాక్ సీన్ తో పాటు, ఫ్లాష్‌బ్యాక్ , క్లైమాక్స్ ఎపిసోడ్‌లలో అతడి నటన ప్రత్యేకంగా ఉంటుందని వెల్లడించాడు. శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని అతడు తెలిపారు. శంకర్ ఈసారి సాధారణ స్థాయిని మించి కమర్షియల్ సీన్స్ తెరకెక్కించారని, మాస్‌కు నచ్చుతాయని అన్నారు. రామ్ చరణ్ అభిమానులను సంతృప్తి పరచడానికి శంకర్ అతడి పాత్రకు కమర్షియల్ టచ్ ఇచ్చారని చెబుతున్నారు. థమన్ బీజీఎం కూడా అదిరిపోతుందని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిందని కూడా రూబెన్ గతంలో వెల్లడించారు.