Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప‌ట్టేసిన క‌ళ్యాణ్ రామ్!

NKR21గా రూపొందుతున్న ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ చాలా డిఫ‌రెంట్ గా మేకోవ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 11:31 AM IST
ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప‌ట్టేసిన క‌ళ్యాణ్ రామ్!
X

డెవిల్ మూవీతో హిట్ అందుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నుంచి ఇప్ప‌టివ‌రకు మరో సినిమా రాలేదు. దీంతో క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నంద‌మూరి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే.

అశోక్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో అశోక్ వ‌ర్ధ‌న్ ముప్పా, సునీల్ బ‌లుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ముప్పా వెంక‌య్య చౌద‌రి ప్రెజెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. క‌ళ్యాణ్ రామ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. NKR21గా రూపొందుతున్న ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ చాలా డిఫ‌రెంట్ గా మేకోవ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది.

హై ఓల్టేజ్ యాక్ష‌న్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు ముందుగా మెరుపు అనే టైటిల్ ను ఫిక్స్ చేశార‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. NKR21 క‌థ‌కు రుద్ర అనే టైటిల్ అయితే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని మేక‌ర్స్ ఆ టైటిల్ ను ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

ఈ సినిమాతో అల‌నాటి తార విజ‌యశాంతి ప‌వ‌ర్‌ఫుల్ లేడీ పోలీసాఫీస‌ర్ రోల్ ద్వారా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే చిన్న గ్లింప్స్ ద్వారా తెలిపారు. ఆమెతో పాటూ సోహైల్ ఖాన్, సాయి మంజ్రేక‌ర్, శ్రీకాంత్ NKR21లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాంతార ఫేమ్ అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఆడియ‌న్స్ కు మంచి అంచ‌నాలున్నాయి.

ఇప్ప‌టికే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే రివీల్ చేయ‌నున్నారు. యాక్ష‌న్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా ట్రీట్ గా ఉండ‌నుంద‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే క‌ళ్యాణ్ రామ్ లోని నెక్ట్స్ లెవెల్ మాస్ NKR21 సినిమాలో చూడొచ్చ‌ని అర్థ‌మ‌వుతుంది.