Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఓటిటిలో ఫ్యామిలీ స్టార్ సినిమా

అధికారికంగా ఎలాంటి హడావుడి చేయకుండా సినిమా ను సైలెంట్ గా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:17 AM GMT
ఇప్పుడు ఓటిటిలో ఫ్యామిలీ స్టార్ సినిమా
X

ఫ్యామిలీ స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకొని.. ఒకప్పుడు స్టార్ హీరోలకి హీరో గా పోటీ ఇచ్చిన జగపతిబాబు ఈ మధ్య కాలం లో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించడంతో పాటు విలన్ గా కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయం లో జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

థియేటర్ రిలీజ్ అయిన రుద్రంగి సినిమాకి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయ్యి నాలుగు వారాలు కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటిటి ద్వారా మరో సారి తీసుకు వచ్చారు.

అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి హడావుడి చేయకుండా సినిమా ను సైలెంట్ గా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో జగపతిబాబు పాత్రకి, నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆయన లీడ్ రోల్ చేయడంతో సినిమా కు అదనపు ఆకర్షణగా నిలిచారు.

ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న విమల రామన్ మరియు మమతా మోహన్ దాస్ ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ స్క్రీనింగ్ మిస్ అయినవారు ఓటిటి స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేల కు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.