Begin typing your search above and press return to search.

గుబులు రేపుతున్న‌ రుహానీ ఫోజ్

ఆ త‌ర్వాత 'డ‌ర్టీ హ‌రి' లాంటి బోల్డ్ మూవీలో అద్భుత పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   16 Feb 2025 5:37 AM GMT
గుబులు రేపుతున్న‌ రుహానీ ఫోజ్
X

రుహానీ శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చిల‌సౌ చిత్రంలో సుశాంత్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. మొద‌టి సినిమాతోనే ఈ బ్యూటీ త‌న‌దైన న‌ట ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత 'డ‌ర్టీ హ‌రి' లాంటి బోల్డ్ మూవీలో అద్భుత పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. హిట్ - ది ఫ‌స్ట్ కేస్ చిత్రంలో మ‌రోసారి ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంది. తెలుగు-త‌మిళంలో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంది.


నేచుర‌ల్ బ్యూటీ రుహానీ సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. ఈ హిమ‌చ‌ల్ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తోంది. రుహానీ తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతోంది. ఈ భామ‌ బ్లేజ‌ర్ లో మ‌రోసారి త‌న‌లోని బోల్డ్ యాంగిల్ ని బ‌య‌ట‌పెట్టింది. భారీత‌నం నిండిన బ్లేజర్ ధ‌రంచిన రుహానీ థై సొగ‌సుల్ని ఎలివేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా షేర్ అవుతోంది. రుహానీ ఈ గెట‌ప్‌లో స్ట‌న్నింగ్ అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. ''వెలుగు నీడల మధ్య కొట్టుకుపోవడం, ఆలోచనలు కవిత్వంగా మారడం...'' అంటూ ఈ ఫోటోషూట్ కి రుహానీ పోయెటిక్ క్యాప్ష‌న్ ఇచ్చింది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రుహాని త‌దుప‌రి `మీట్ క్యూట్` అనే సిరీస్ లో న‌టించింది. అలాగే యోడ్లీ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'ఆగ్రా' అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో బోల్డ్ పెర్ఫామెన్స్ కి సంబంధించిన క్లిప్స్ ఇటీవ‌ల లీక‌య్యాయి. దీనిపై చాలా మంది షాక్ కి గుర‌వ్వ‌డ‌మే గాక ఈ సిరీస్ వివాదాల గురించి చ‌ర్చించుకున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ గా క‌నిపించే రుహానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ లో న‌టించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. రుహానీ ఇటీవ‌ల టాలీవుడ్ కి దూర‌మైంది. ఇక్క‌డ సినిమాలేవీ ప్ర‌క‌టించ‌లేదు.