Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : రుహానీ మిర్రర్‌ బికినీ సెల్ఫీ

తాజాగా షేర్‌ చేసిన ఈ బికినీ ఫోటో వైరల్‌ అవుతోంది. మిర్రర్‌ సెల్ఫీ తో అందరి దృష్టిని ఆకర్షించింది

By:  Tupaki Desk   |   22 Sep 2024 6:17 AM GMT
పిక్ టాక్‌ : రుహానీ మిర్రర్‌ బికినీ సెల్ఫీ
X

తెలుగు ప్రేక్షకులకు 2018 లో చిలసౌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. హిట్‌ 1 సినిమాలో హీరోయిన్‌ గా నటించి మరో విజయాన్ని సొంతం చేసుకున్న రుహానీ శర్మకి ఆ తర్వాత డర్టీ హరి ఇంకా పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో వచ్చిన రుహానీ శర్మ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి అందమైన ఫోటోను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వడం లేదు.

వచ్చే ఏడాదిలో సైతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్న రుహానీ శర్మ షేర్ చేసిన ఈ తాజా పిక్చర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కెరీర్ ఆరంభం లో పద్దతైన డ్రెస్ లో కనిపించిన రుహానీ శర్మ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా షేర్‌ చేసిన ఈ బికినీ ఫోటో వైరల్‌ అవుతోంది. మిర్రర్‌ సెల్ఫీ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పద్దతైన డ్రెస్ ల్లో కన్నుల విందు చేసిన రుహానీ శర్మ ఇలా బికినీ అందాల్లోనూ ఆకట్టుకుంటుంది అనే అభిప్రాయంను ఈ ఫోటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

బికినీ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు అందాల విందు చేస్తారు. అయితే ఈ ఫోటోలో రుహానీ శర్మ చాలా స్పెషల్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా చీర కట్టు లో కనిపించిన ముద్దుగుమ్మలను బికినీ లో చూస్తే ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఉందంటూ విమర్శలు చేస్తారు. కానీ రుహానీ శర్మ అలా బాగుంది, ఇలాగా బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి ఫిజిక్ తో పాటు ఔట్‌ ఫిట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుందని దీన్ని బట్టి క్లారిటీ వచ్చింది.

తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ ముందు ముందు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ లో నటిగా, అందంతో మెప్పించిన రుహానీ శర్మ మలయాళంలోనూ కమల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సైతం రుహానీకి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా మ్యూజిక్ వీడియోలు, వెబ్‌ సిరీస్ లు ఇలా అనేక రకాలుగా చేస్తోంది. కనుక ముందు ముందు రుహానీ సోషల్‌ మీడియాలో మరింత సెన్షేషన్ గా మారే అవకాశాలు ఉన్నాయి.