పిక్‌టాక్ : డర్టీ బ్యూటీ అందాల షో
మొదటి సినిమా చిలసౌతో గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత హిట్ : మొదటి కేసు సినిమా లోనూ నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 22 Feb 2025 11:12 AM GMT'చిలసౌ' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేక పోయింది. హీరోయిన్‌గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు కొన్నే అయినా సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2013లో థేకా బై అమ్మీ బాస్, క్లాస్‌రూమ్, కుడి తు పటాకా పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. 2018లో టాలీవుడ్‌లో చిలసౌ సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

మొదటి సినిమా చిలసౌతో గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత హిట్ : మొదటి కేసు సినిమా లోనూ నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే 'డర్టీ హరి' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ డర్టీ సినిమాలో డీసెంట్‌గానే నటించినప్పటికీ ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలోనూ నటించింది. మెల్ల మెల్లగా ఈ అమ్మడి ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. గత ఏడాది ఈమె నటించిన సైంధవ్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

గత ఏడాది అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుహాని శర్మ ఒక్క హిట్ అందుకోలేక పోయింది. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా మినహా మరే సినిమాలను ఈమె చేయడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈమెకు ఆఫర్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముందు ముందు ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలిచి, తన అందంతో ఆకట్టుకుంటే ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఈసారి ఈ అమ్మడు బెడ్ పై అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాకు నైట్‌కి మధ్య లవ్ స్టోరీ అంటూ ఈ నైట్ షేడ్ బెడ్ రూం ఫోటోలను షేర్ చేసింది.

ఇలాంటి అందాల ఫోటోలను షేర్ చేయడం ద్వారా మళ్లీ ఈ అమ్మడు బిజీ అయ్యేనా చూడాలి. తెలుగులో ఈమె చివరగా లవ్ మీ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించగా ఈమె కీలక పాత్రలో నటించింది. మాస్క్ అనే తమిళ్ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మరో హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది. గత ఏడాది ఈమె బ్లాక్ ఔట్ సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలవలేక పోయింది. మరి ఈసారి అయినా హిందీలో ఈ అమ్మడి సినిమా నిలబడుతుందేమో చూడాలి.