Begin typing your search above and press return to search.

చిలసౌ బ్యూటీ భలే లక్కీ..!

వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రాకున్నా ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద ఆఫర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:53 AM GMT
చిలసౌ బ్యూటీ భలే లక్కీ..!
X

టాలీవుడ్‌ లో చిలసౌ చిత్రంతో 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. అంతకు ముందు తమిళ సినిమా చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్‌ లో మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకోవడంతో పాటు ఆఫర్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేయడం ద్వారా తనను తాను నిరూపించుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మ చిలసౌ రుహానీ శర్మ తాజాగా తమిళ క్రేజీ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మాణంలో నటించే అవకాశం దక్కింది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటారు.

వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రాకున్నా ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద ఆఫర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు మరింత బిజీ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి.

కవిన్ తో కలిసి రుహానీ శర్మ మాస్క్ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకుంటుంది. సినిమాకు సంబంధించిన వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. విక్రమ్‌ అశోక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక వైపు విడుతలై పార్ట్‌ 2 షూటింగ్‌ తో బిజీగా ఉన్నా కూడా దర్శకుడు వెట్రిమారన్‌ 'మాస్క్‌' సినిమా మేకింగ్‌ విషయంలో శ్రద్ద తీసుకుంటున్నాడు. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే కాదు అనే ఉద్దేశ్యంతో ప్రతి బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడని సమాచారం అందుతోంది.