Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఒక్కసారిగా రూట్ మార్చిన చి ల సౌ!

ఇప్పుడు పింక్ ఇన్నర్‌ మరియు డెనిమ్ జీన్స్ ధరించి, చొక్కా బటన్స్ తొలగించి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది

By:  Tupaki Desk   |   20 Aug 2024 3:30 PM GMT
పిక్ టాక్ : ఒక్కసారిగా రూట్ మార్చిన చి ల సౌ!
X

తెలుగు ప్రేక్షకులకు చి ల సౌ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. కెరీర్ ఆరంభంలో చాలా పద్దతైన పాత్రల్లో నటించడంతో పాటు, నటిగా మంచి మార్కులు దక్కించుకున్న రుహానీ శర్మ ఇప్పుడు అందం విషయంలో హద్దులు దాటేసిందా అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ రేంజ్ లో అందంగా కనిపించడం వరకు అయితే ఓకే. కానీ ఈమె అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చి ల సౌ తో పాటు ఎన్నో సినిమాల్లో చీర కట్టుతో పాటు పద్దతైన ఔట్‌ ఫిట్‌ లో రుహానీ శర్మ కనిపించింది.

ఇప్పుడు పింక్ ఇన్నర్‌ మరియు డెనిమ్ జీన్స్ ధరించి, చొక్కా బటన్స్ తొలగించి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల ఒక సినిమాలో కూడా ఈమె హద్దులు దాటి శృంగార సన్నివేశాలను చేసింది అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో పాటు, కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలతో మరోసారి రుహానీ శర్మ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ స్థాయిలో అందంగా కనిపించడం హీరోయిన్స్ కు సాధారణ విషయం. కానీ రుహానీ శర్మను గతంలో వేరే విధంగా చూసి ఇప్పుడు ఇలా చూడలేక పోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో కమర్షియల్‌ గా హిట్‌ కొట్టాలంటే, కమర్షియల్‌ హీరోయిన్‌ గా నిలవాలంటే స్కిన్‌ షో తప్పనిసరి, అంతే కాకుండా కొన్ని సార్లు హద్దులు మీరి సన్నివేశాల్లో ఉంటుంది అనేది తెలిసిన విషయమే. కనుక ఇక్కడ రుహానీ ని తప్పుపట్టేది ఏముందని కొందరు కామెంట్స్ చేస్తే కొందరు మాత్రం కెరీర్ ఆరంభంలో అలా చేసి, ఇప్పుడు ఆఫర్ల కోసం ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఆమెను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మరి రుహానీ వారికి ఏమని సమాధానం ఇస్తుంది అనేది చూడాలి.

ఈ సంవత్సరం ఇప్పటికే సైంధవ్‌, ఆపరేషన్‌ వాలెంటైన్‌, శ్రీరంగనీతులు, నన్ను ప్రేమించు, బ్లాక్ అవుట్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుహానీ శర్మ ప్రస్తుతం మాస్క్‌ సినిమాలో నటిస్తోంది. ఆ తమిళ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉందని, త్వరలోనే విడుదల అవ్వబోతుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం తెలుగు లో సినిమాలు ఏమీ లేవు. కానీ ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ముందు ముందు రుహానీ శర్మ ను మరింత అందాల ఆరబోత ఫోటోలతో చూస్తామా అనేది చూడాలి.