రుహానీ లీక్ వీడియో.. రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఆ సినిమాకు అనేక ప్రశంసలతోపాటు అవార్డులు కూడా వచ్చాయి.
By: Tupaki Desk | 25 Aug 2024 12:30 AM GMTరుహానీ శర్మ.. ఈ హీరోయిన్ పేరు ఇటీవల బాగా వినిపించిన విషయం తెలిసిందే. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. ఆ మూవీలో అంజలి పాత్రతో సినీ ప్రియులను అలరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఖాళీ లేకుండా సినిమాల్లో నటిస్తోంది. అయితే గత ఏడాది ఆమె నటించిన ఆగ్రా మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఆ సినిమాకు అనేక ప్రశంసలతోపాటు అవార్డులు కూడా వచ్చాయి.
అయితే ఆ సినిమాలోని కొన్ని బోల్డ్ సీన్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో రుహానీని చూసి తాము షాకయినట్లు కొందరు నెటిజన్లు తెలిపారు. మరికొందరు దారుణంగా ట్రోల్స్ చేశారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్ పై రుహానీ ఇటీవల రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. తనను జడ్జ్ చేయడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సీన్లు ఆధారంగా సినిమాపై అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదని తెలిపింది. మూవీ కోసం చాలా కష్ట పడినట్లు చెప్పింది.
ఇప్పుడు ఆగ్రా మూవీ అండ్ రుహానీ శర్మ పోస్ట్ పై ఆమె డెబ్యూ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఆమె టాలెంట్ పట్ల ప్రశంసలు కురిపించారు. ఆగ్రా వంటి సినిమాల స్క్రిప్ట్ లను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని తెలిపారు. రుహానీతో కలిసి వర్క్ చేయడం తన లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ల్లో ఒకటిగా చెప్పారు. ఆమె టాలెంట్ ను తెలుసుకోవడం కూడా అలాంటిదేనని పేర్కొన్నారు. రుహానీ గొప్ప నటి అని రవీంద్రన్ కొనియాడారు.
ఆమెలో కొంచెం కూడా గర్వం ఉండదని తెలిపారు రాహుల్ రవీంద్రన్. ఆగ్రా మూవీ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను ఇంకా ఆగ్రా చిత్రాన్ని చూడలేదని తెలిపారు. కానీ ఆ సినిమా స్టోరీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా చిత్రం గొప్పతనాన్ని క్లియర్ గా తెలుసుకున్నానని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. అయితే అలాంటి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరికైనా కచ్చితంగా ధైర్యం ఉండాలని తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో రుహానీ శర్మ లాంటి ధైర్యవంతులైన యాక్టర్లు ఉండడం మన అందరి అదృష్టమని కొనియాడారు. ఆమె లాంటి హీరోయిన్లు అన్ని చిత్ర పరిశ్రమలకు కచ్చితంగా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రుహానీ కూడా రాహుల్ రవీంద్రన్ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. తనకు అండగా ఎల్లప్పుడూ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పింది. రాహుల్ పోస్ట్ తనలో ధైర్యం నింపిందని పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.