Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : మతి పోగొట్టేంత అందం చూశారా!

మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో నటించిన రూహి దిలీప్ సింగ్‌ గుర్తుండే ఉంటుంది

By:  Tupaki Desk   |   15 Dec 2023 12:30 AM GMT
పిక్‌ టాక్‌ : మతి పోగొట్టేంత అందం చూశారా!
X

మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో నటించిన రూహి దిలీప్ సింగ్‌ గుర్తుండే ఉంటుంది. ఆమె అందంతో పాటు, అభినయంతో మెప్పించింది. అయితే సినిమా ఆకట్టుకోలేక పోవడంతో రుహి దిలీప్ గురించి టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు.


2020 లో టైమ్స్ వారి 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్ జాబితాలో టాప్‌ 10 లో చోటు దక్కించుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌ లో ఈమె తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ నిరాశే మిగిలింది.


అందంతో పాటు మంచి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఈమె సొంతం. అందుకే ఫోటో షూట్స్ లో కూడా ఈమె నటిస్తుందా అన్నట్లుగా ఉంటుంది అంటూ కొందరు అంటూ ఉంటారు. తాజాగా ఫోటో షూట్‌ లోనూ తన అందంతో పాటు తన యొక్క నటన ప్రతిభను కూడా కనబర్చినట్లుగా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

మొత్తానికి రుహి దిలీప్ సింగ్‌ మూడు పదుల వయసుకు వచ్చినా కూడా అందం పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. కనుక రాబోయే రోజుల్లో బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా ఈ అమ్మడు ఆఫర్లతో బిజీ అవ్వడంతో పాటు, తన నటనతో మరియు అందంతో ప్రేక్షకులను వెండి తెర ద్వారా మెప్పించే అవకాశాలు ఉన్నాయంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.