Begin typing your search above and press return to search.

ఫిక్ టాక్ : 'మోసగాళ్లు' బ్యూటీ అందం అదరహో

2012 లో ది వరల్డ్ బిఫోర్ హెర్ అనే ఇంగ్లీష్ సినిమా లో రూహి సింగ్ కనిపించింది. ఆ తర్వాత హిందీ చిత్రం క్యాలెండర్ గర్ల్స్ లో కూడా రూహి నటించింది

By:  Tupaki Desk   |   15 Dec 2023 9:30 AM GMT
ఫిక్ టాక్ : మోసగాళ్లు బ్యూటీ అందం అదరహో
X

2020 సంవత్సరంలో టైమ్స్ వారి 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాలో టాప్ 10 లో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ రూహి దిలీప్ సింగ్. 1990 లో జన్మించిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు మోడలింగ్ లో రాణించింది. ఎన్నో యాడ్స్ లో నటించి మెప్పించింది.


2012 లో ది వరల్డ్ బిఫోర్ హెర్ అనే ఇంగ్లీష్ సినిమా లో రూహి సింగ్ కనిపించింది. ఆ తర్వాత హిందీ చిత్రం క్యాలెండర్ గర్ల్స్ లో కూడా రూహి నటించింది. ఇక సౌత్‌ లో తమిళం మరియు తెలుగు లో కూడా ఈమె నటించింది. మంచు విష్ణు హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం మోసగాళ్లు లో రూహి హీరోయిన్ గా నటించింది.


సినిమాలతో పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నా రూహి సింగ్ సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా రూహి అందమైన ఫోటో షూట్స్ ఉంటున్నాయి.

రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండే రూహి ఈ సారి వైట్‌ బికినీ పిక్స్‌ ను షేర్ చేసింది. కూల్ అండ్‌ సింపుల్‌ మేకోవర్‌ తో చాలా అందంగా అదరహో అన్నట్లుగా మోసగాళ్లు బ్యూటీ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత అందం కు ముందు ముందు అయినా మంచి ఆఫర్లు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.