Begin typing your search above and press return to search.

సప్త సాగారాల బ్యూటీ ఈ షాక్ ఊహించలేదా..?

తమిళ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటే మాత్రం మరో ఐదారేళ్ల దాకా టాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం లేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 9:30 PM GMT
సప్త సాగారాల బ్యూటీ ఈ షాక్ ఊహించలేదా..?
X

టాలీవుడ్ లో కన్నడ భామలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి హీరోయిన్ స్టార్ అవ్వకపోవచ్చు కానీ కన్నడ భామలకు తెలుగు పరిశ్రమలో మాత్రం మంచి ప్రియారిటీ ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టిస్తున్న రష్మిక మందన్న కూడా కన్నడ నుంచి టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ స్టార్ ఇమేజ్ సాధించిన తర్వాతే బాలీవుడ్ ఆఫర్లు రాబట్టుకుంటుంది.

రష్మిక బాటలోనే చాలామంది కన్నడ నుంచి తెలుగు పరిశ్రమకు వస్తున్నారు. ఐతే వారిలో ఆడియన్స్ దృష్టిలో పడిన వారు మాత్రం కొందరు మాత్రమే. కన్నడలో సప్త సాగరాలు దాటితో యువత మనసులు దోచేసింది రుక్మిణి వసంత్. అమ్మడు ఆ సినిమాలో ప్రియ పాత్రలో చేసి యూత్ ఆడియన్స్ అందరికీ ప్రేమికురాలిగా మనసులు దోచేసింది. తెలుగులో సప్త సాగరాలు దాటి సినిమా ఆమె కోసమే చూశారంటే నమ్మాలి.

ఐతే అలాంటి రుక్మిణి తెలుగు ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుందని అనుకున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఆమె పేరు బాగా వినిపించింది. తారక్ సినిమాతో ఎంట్రీ అని అందరు అనుకున్నారు. కానీ రుక్మిణి సైలెంట్ గా నిఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఆ సినిమా ఎప్పుడు తీశారో కూడా తెలియని విధంగా సినిమా చేశారు. నిఖిల్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో రుక్మిణి వసంత్ నటించింది.

ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. ప్రమోషన్స్ కూడా నామ మాత్రంగానే చేశారు. ఐతే తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న అభిమానంతో నిఖిల్ సినిమా చేయగా అది కాస్త అమ్మడికి షాక్ ఇచ్చింది. ఐతే రుక్మిణి లాంటి హీరోయిన్ తెలుగులో ప్రేమకథలు తీయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. సప్త సాగరాలు దాటి తరహాలో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తే మాత్రం తెలుగులో రుక్మిణి క్లిక్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఐతే తెలుగులో నెక్స్ట్ ఆఫర్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ అమ్మడు తమిళ్ లో మాత్రం శివ కార్తికేయన్ తో జత కడుతుంది. తమిళ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటే మాత్రం మరో ఐదారేళ్ల దాకా టాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం లేదని చెప్పొచ్చు.