Begin typing your search above and press return to search.

పాపం బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అమ్మడు..!

కన్నడలో సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఆ సినిమా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో అన్ని చోట్ల క్రేజ్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 1:30 PM GMT
పాపం బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అమ్మడు..!
X

కన్నడలో సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఆ సినిమా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో అన్ని చోట్ల క్రేజ్ తెచ్చుకుంది. సప్త సాగరాలు దాటి సినిమాలో రుక్మిణి చేసిన ప్రియ పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఆ సినిమాతోనే అమ్మడికి అందరు ఫ్యాన్స్ అయ్యారు. ఐతే ఆ క్రేజ్ తోనే తెలుగులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆఫర్ రాగా అంతకుముందే నిఖిల్ సినిమాతో రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా అమ్మడికి పెద్ద షాకే ఇచ్చింది.

ఐతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తో తెలుగులో సూపర్ ఎంట్రీ దొరుకుతుందని భావించిన రుక్మిణికి నిఖిల్ సినిమా రిజల్ట్ నిరాశ పరిచింది. ఐతే తెలుగులో మరిన్ని సినిమాల ఆఫర్లు వస్తున్నా కూడా అమ్మడు చేయడం కుదరట్లేదని తెలుస్తుంది. అలా ఎందుకు అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు టైం ఇచ్చిన రుక్మిణి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేలా ఉండాలని ముందే చెప్పారట. అందుకే రుక్మిణి మరో సినిమా కు సైన్ చేయలేదు.

ఎన్టీఆర్ నీల్ సినిమానే కాదు రిషబ్ శెట్టి కాంతార 2 కూడా రుక్మిణి ఖాతోలో ఉంది. ఐతే ఈ రెండు సినిమాలకు ఆమెను లాక్ చేసి మిగతా సినిమాలేవి చేయకుండా చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ రెండు సినిమాలు పూర్తయ్యే దాకా మరో సినిమా చేయకూడదని మేకర్స్ షాక్ ఇచ్చారట. ఐతే ఆమె ఎన్టీఆర్, కాంతారా 2 తో పాటు మరికొన్ని సినిమాలు కమిటైంది. కానీ ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేకపోతుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో రుక్మిణి నటించడం ఫిక్స్ అయితే మాత్రం అమ్మడికి ఇక తిరుగులేదని చెప్పొచ్చు. కాంతారా 2 కూడా క్రేజీ ప్రాజెక్ట్ కానుంది. సో ఈ రెండిటితో సౌత్ లో టాప్ లీగ్ లోకి రావాలని చూస్తుంది రుక్మిణి. మరి అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో తెలియాలంటే ఈ సినిమాలు రావాల్సిందే. మరోపక్క తమిళ్ లో ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తుంది రుక్మిణి.