Begin typing your search above and press return to search.

రుక్మిణీ వసంత్.. మరో రష్మిక అవుతుందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీలు రష్మిక మందన్న, పూజా హెగ్డే ఎంత పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:12 AM GMT
రుక్మిణీ వసంత్.. మరో రష్మిక అవుతుందా?
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీలు రష్మిక మందన్న, పూజా హెగ్డే ఎంత పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే. పూజ వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా రష్మిక మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటోంది. ఇటీవలే యానిమల్ తో అలరించిన ఈ బ్యూటీ.. వరుస చిత్రాల్లో నటిస్తోంది.


ఇప్పుడు అదే కోవలోకి మరో కన్నడ భామ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటోంది. ఆమె ఎవరో కాదు.. రుక్మిణీ వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయింది ఈ బ్యూటీ. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజైంది. సైడ్-ఏ, సైడ్-బి అంటూ రెండు భాగాలుగా వచ్చి తెలుగులో మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది.

అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక రుక్మిణిని చాలా మంది మేకర్స్ సంప్రదించారట. కానీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే వరకు ఆమె ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ రెండు చిత్రాల్లో రుక్మిణి నటన, లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక సెకెండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక ఆమెకు ఛాన్సులు వెల్లువెత్తుతున్నాయి. తమిళం, తెలుగు భాషల దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో రుక్మిణి అవకాశాలు దక్కించుకుంటోంది.

తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి తదుపరి చిత్రానికి సంతకం చేసింది రుక్మిణీ వసంత్. స్టార్ డైరెక్టెర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ అమ్మడు.

తెలుగులో విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ పేరు పరిశీలించినట్టు వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత రవితేజ మూవీ విషయంలో కూడా ఈమె పేరే వినిపించింది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఇక రష్మిక రేంజ్ లో రుక్మిణి కూడా పాపులర్ అవుతుందని ఇప్పుడు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. రష్మికను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టి సినిమాతోనే, ఈమె కూడా తెలుగులో పాపులర్ అవ్వడం విశేషం. మరి సౌత్ లో రుక్మిణి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.