టీచర్ అవ్వాల్సిన ఈ బ్యూటీ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది..
‘బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సౌత్ ప్రాజెక్టులకు మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది.
By: Tupaki Desk | 25 Jun 2024 7:14 AM GMTసప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రుక్మిణీ వసంత్.. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మూవీలో ఆమె భార్యగా, ప్రియురాలుగా నటించిన విధానం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే ఇందుకు కారణం. తమ ఇంట్లో ఉండే అమ్మాయిలా కనిపించే రుక్మిణి సప్త సాగరాలు దాటి మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. నాచురల్ గా నటించే ఈ బ్యూటీ అసలు అవ్వాలనుకున్న ప్రొఫెషన్ వేరే అన్న విషయం మీకు తెలుసా?
ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రుక్మిణీ ఆ తర్వాత నటి కావాలి అనే ఆసక్తితో సినిమాల్లోకి 2019లో ఆమె బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. 2023లో సప్త సాగరాలు దాటి ఏ మూవీ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాలపై అందరి దృష్టి ఉండడం ఎంతో ఆనందకరంగా ఉంది అని పేర్కొంది.
‘బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సౌత్ ప్రాజెక్టులకు మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. వైవిద్యమైన కథలను ఇలాంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించడం ఒక అద్భుతమైన విషయం. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకులు ఒక అద్భుతమైన అనుభూతిని చెందుతారు. మంచి చిత్రాల ద్వారా విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రుక్మిణీ అంది.
‘నేను సినీ ఇండస్ట్రీలోకి రాకపోయినట్లయితే ఖచ్చితంగా టీచర్‌ను అయ్యేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. మరి ముఖ్యంగా సప్త సాగరాలు దాటి చిత్రం గుర్తింపు తర్వాత అవకాశాలు ఎక్కువ రావడం మొదలయ్యాయి. ఇతర భాషల్లో నటిస్తున్నప్పుడు కొత్త భాషలు నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాను. భాష నేర్చుకోవడంతో పాటు అక్కడ ప్రేక్షకులకు ఎలా నచ్చుతాను అన్న విషయంపై కూడా నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు నచ్చితేనే కదా నటిగా నాకు సంతృప్తి కలిగేది’అంటూ ఆమె తన మనసులోని మాట బయట పెట్టింది. ప్రస్తుతం తమిళ్‌లో 'ఎస్కే 23', 'ఏస్’ మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో రవితేజ సరసన నటించబోతున్నట్లు టాక్.