Begin typing your search above and press return to search.

సప్త సాగరాలు దాటినా అవకాశాల్లేవా..?

ఎలా చేసినా ప్రేక్షకుల మనసు గెలవడమే హీరోయిన్స్ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన భామలు మనసులు గెలిచేస్తే వాళ్లను దేవతల్లా కొలుస్తుంటారు

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:30 AM GMT
సప్త సాగరాలు దాటినా అవకాశాల్లేవా..?
X

ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయినా సరే.. తెర మీద ఎంత పెద్ద సూపర్ హీరోఉన్నా సరే తెర అందంగా కనిపించాలి అంటే అందమైన కథానాయిక ఉండాల్సిందే. అలాంటి కథానాయికలు ఎక్కడ ఉన్నా వారికి తగిన ఛాన్సులు వస్తాయి. కొందరు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే కొందరు గ్లామర్ ని నమ్ముకుని అవకాశాలు అందుకుంటారు. ఎలా చేసినా ప్రేక్షకుల మనసు గెలవడమే హీరోయిన్స్ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన భామలు మనసులు గెలిచేస్తే వాళ్లను దేవతల్లా కొలుస్తుంటారు.

ఈమధ్య కాలంలో అంతగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కన్నడ భామ రుక్మిణి వసంత్ ఉందని చెప్పొచ్చు. కన్నడలో అంతకుముందు 3 సినిమాలు, హిందీలో ఒక సినిమా చేసిన రుక్మిణి రక్షిత్ శెట్టి తో నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో ప్రియ పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అంటే నమ్మాల్సిందే. ఆ సినిమా కేవలం కన్నడలోనే కాదు సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో అమ్మడికి సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఫిదా అయ్యారు.

ఈమధ్య కాలంలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా వెతికిన సందర్భాలు చాలా తక్కువ. కానీ సప్త సాగరాలు రెండు భాగాలు రిలీజ్ అయ్యాక రుక్మిణి వసంత్ గురించి బాగా వెతకడం మొదలు పెట్టారు. ఆడియన్స్ సప్త సాగరాలు సక్సెస్ తో ఆమె తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటుందని ఊహించారు. అయితే కోలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు సైన్ చేసిన రుక్మిణికి తెలుగు నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదు.

టాలీవుడ్ నుంచి నిజంగానే ఆఫర్ రాలేదా లేదా వచ్చినా కూడా అమ్మడు చేయలేదా అన్నది తెలియదు కానీ ప్రస్తుతం కన్నడలో భగీరా, భైరథి రణగల్ సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి తమిళంలో ఏస్ ఇంకా శివ కార్తికేయ 23వ సినిమాలో నటిస్తుంది. శివ కార్తికేయన్ తో జత కడుతుంది అంటే అమ్మడికి మంచి ఎంట్రీనే దొరికిందని చెప్పొచ్చు. ఐతే తెలుగు ప్రేక్షకులు కూడా రుక్మిణి తెలుగు ఎంట్రీ ఇస్తే చూడాలని ఆరాటపడుతున్నారు. కన్నడ నుంచి వచ్చి తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో రుక్మిణి వసంత్ కూడా చేరుతుందా లేదా అన్నది అమ్మడు ఇక్కడ స్ట్రైట్ సినిమా చేస్తేనే కానీ తెలుస్తుంది.