హీరోయిన్ గొడవ.. హీరో ఏమన్నారంటే..
సినిమా ప్రమోషన్లలో నటీనటులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఫోటోలు తీయించుకోవడం సర్వసాధారణం.
By: Tupaki Desk | 8 March 2025 4:31 PM ISTసినిమా ప్రమోషన్లలో నటీనటులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఫోటోలు తీయించుకోవడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే పెద్ద చర్చలకు దారి తీస్తాయి. తాజాగా కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ కలిసి నటించిన దిల్‌రూబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రుక్సర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిచ్చాయి. మీడియా ఫోటోగ్రాఫర్లు తీసే ఫోటోలకు సంబంధించి ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు, కొంతమంది తీరుపై తన నిరసన వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అవుతూ మీడియా వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఈ ఈవెంట్‌లో రుక్సర్ స్టేజ్ పై మాట్లాడుతూ, ఇక్కడ అందరూ చూసారు ఏం జరిగిందో, ఫొటోలు తీసేటప్పుడు కొంచెం హీరోయిన్స్ సంబంధించి చూసి తీయాలనే భావనను ఆమె వ్యక్త పరిచినట్లు అనిపించింది. అలాగే ఆమె మీడియా ముందుకు వచ్చి వారిని పట్టించుకోకుండా కావాలని పర్సనల్ ఫొటో షూట్ లో బిజీ అయ్యారనే కామెంట్స్ కూడా వచ్చాయి.
ఒక్కసారిగా అంటూ ఓ కామెంట్ చేసింది. అయితే ఆ విషయం గురించి ఆమె పూర్తిగా వివరించకపోవడంతో అసలు ఏం జరిగింది? ఆమెకు అసహనానికి కారణమేంటి? అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తాయి. దీంతో ఆమె మీడియాపై, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లపైనే కామెంట్ చేసిందని కొన్ని వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. సోషల్ మీడియాలో ఈ విషయం మరింత ఊపందుకుంది. చాలామంది ఆమెను సమర్థించగా, మరికొందరు ఇలా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
ఇది పెరుగుతున్న నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ఈ అంశంపై స్పందించాడు. రుక్సర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ, ఈ వ్యవహారం మీడియాకు సంబంధించి కాదని స్పష్టం చేశాడు. దీంతో ఈ ఘటనపై కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి. అసలు రుక్సర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? ఆమె కోపానికి అసలు కారణం ఏంటి? అన్నదానిపై ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. కిరణ్ ఈ వ్యవహారంపై ఇంకాస్త లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అంతకు ముందు జరిగిన ఓ సందర్భంలో కూడా రుక్సర్ ధిల్లాన్ మీడియా ఫోటోగ్రాఫర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిందనే టాక్ ఉంది. ఓ ప్రచార కార్యక్రమంలో ఆమె తన వ్యక్తిగత ఫోటోషూట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, మీడియాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ సందర్భం అప్పట్లో పెద్దగా వైరల్ కాకపోయినా, ఇప్పుడు ఆమె తాజా వ్యాఖ్యలతో మళ్లీ చర్చకు వచ్చింది. దీంతో ఫోటోగ్రాఫర్లు, సినీ మీడియా వర్గాలు ఈ వ్యవహారాన్ని గమనించక తప్పలేదు. ఇక హీరో అయితే పెద్దగా చర్చకు తావివ్వకుండా గొడవ మాత్రం మీడియా ఫొటో గ్రాఫర్స్ కు సంబంధించినది కాదని అన్నారు.