డిజైనర్ బ్లౌజులో రుక్షార్ అందాల విందు
అటుపై నాని-మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రంలోనూ నాయికగా నటించింది.
By: Tupaki Desk | 26 Jan 2024 6:14 PM GMTకేజీఎఫ్ రాఖీ భాయ్ యష్ సరసన `రన్ ఆంటోని`లో నటించిర రుక్షార్ ఆ తర్వాత `ఆకతాయి` అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అటుపై నాని-మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రంలోనూ నాయికగా నటించింది. అల్లు శిరీష్ సరసన ఏబీసీడీ చిత్రంలో నటించినా ఏదీ కలిసి రాలేదు.
ఇటీవలే విడుదలైన `నా సామి రంగ` సంక్రాంతి పందెంలో రుక్షార్ కి మంచి విజయాన్ని ఇచ్చింది. నాగార్జున, అల్లరి నరేష్ లాంటి స్టార్లు నటించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన ఈ భామ నటించింది. తనదైన అందం అభినయంతో రుక్షార్ కుర్రకారు గుండెల్ని టచ్ చేసింది. రుక్షర్ కి తన నవ్వు కూడా పెద్ద ప్లస్. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు చిత్రాలకు రుక్షార్ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. ఇంతలోనే ఈ భామ వరుస ఫోటోషూట్లతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా రుక్షార్ షేర్ చేసిన హాటెస్ట్ ఫోటోషూట్ మతులు చెడగొడుతోంది.
చాంద్ సిఫారిస్ వైబ్స్ పేరుతో షేర్ చేసిన ఈ ఫోటోషూట్ లో చీరకట్టులో రుక్షార్ ఎంతో అందంగా కనిపిస్తోంది. డిజైనర్ శారీ.. డిజైనర్ బ్లౌజ్ లో ఎంతో అందంగా కనిపించింది. తెలుగులో పెద్ద గేమ్ ని నడిపించాలని కలలు గంటున్న ఈ బ్యూటీకి తదుపరి ఏ హీరో అవకాశం ఇస్తున్నారు? అన్నది చూడాలి. ఇప్పటివరకూ లక్షల్లో అందుకుంటున్న ఈ బ్యూటీ నెమ్మదిగా పారితోషికం పెంచేందుకు అవకాశం ఉంది మరి.