Begin typing your search above and press return to search.

రూల్స్ రంజాన్ సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే?

యువ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి రూల్స్ రంజన్ అనే ఒక డిఫరెంట్ కామెడీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   4 Oct 2023 9:38 AM GMT
రూల్స్ రంజాన్ సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే?
X

యువ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి రూల్స్ రంజన్ అనే ఒక డిఫరెంట్ కామెడీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సింది. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ అక్టోబర్ 6వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయింది. ఇక ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ నేహా శెట్టి మేయిన్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ కూడా పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసింది. అందులో నేహా శెట్టి చాలా గ్లామరస్ గా కనిపించడం కూడా సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. కాబట్టి సినిమా రిజల్ట్ లో ఆమె పాత్ర చాలా కీలకం కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఫినిష్ అయ్యాయి.

రూల్స్ రంజన్ చిత్ర యూనిట్ వారి శక్తి మేరకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక రూల్స్ రంజన్ కొద్ది సేపటి క్రితమే సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. పెద్దగా ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ దక్కినట్లు తెలుస్తోంది.

రెండు గంటల 38 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా రొమాంటిక్ లవ్ సీన్స్ తో పాటు కామెడీ ఎపిసోడ్స్తో కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమాపై దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆక్సిజన్ డిజాస్టర్ అయిన తర్వాత అతని దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే.

ఇక అలాగే హీరో కిరణ్ కూడా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అందుకే రూల్స్ రంజాన్ సినిమా అతనికి కూడా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో మంచి తారాగణం అయితే ఉంది. వెన్నెల కిషోర్ హైపర్ ఆది హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ వంటి ప్రతిభావంతులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై దివ్యాంగ్ లావానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందించారు.