Begin typing your search above and press return to search.

ఫాలో.. అన్ ఫాలో.. అసలేం జరిగింది..?

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా చరణ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియా లో అన్ ఫాలో చేసినట్టుగా హడావిడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 3:19 PM GMT
ఫాలో.. అన్ ఫాలో.. అసలేం జరిగింది..?
X

స్టార్ హీరోల మధ్య ఏమాత్రం గ్యాప్ వచ్చినా దాన్ని ఇంకాస్త పెద్దది చేసేందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ ల గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ తెలిసిందే. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా చరణ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియా లో అన్ ఫాలో చేసినట్టుగా హడావిడి చేస్తున్నారు.

స్టార్ హీరోల సోషల్ మీడియా ఖాతాలు తమకు సంబంధించిన కొందరు మెయింటైన్ చేస్తుంటారు. ఏం చేయాలన్నది వారు చెబితే వీళ్లు చేస్తుంటారు. అదీగాక చరణ్, అల్లు అర్జున్ ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. వారి మధ్య ఫ్యాన్స్ అనుకుంటున్నంత దూరం అయితే ఉంటుందని అనుకోలేం. అదీగాక వారి ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా వీళ్లు ఉండే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా వీళ్లు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతారని చెప్పలేం.

అసలు ఇంతకుముందు చరణ్, అల్లు అర్జున్ ఒకరి సోషల్ మీడియాని మరొకరు ఫాలో అవుతున్నారా.. ఫాలో కాకపోయినా సరే అన్ ఫాలో కొట్టారని హడావిడి చేస్తున్నారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరిని ఫాలో అవ్వాలి.. ఎవరిని అన్ ఫాలో చేయాలి అన్నది కచ్చితంగా ఆ హీరోల వ్యక్తిగత విషయం. చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు ఒకరినొకరు అసలు ఫాలో చేసుకోకపోతే అన్ ఫాలో చేసే ఛాన్స్ లేదు. సో ఇదంతా చూస్తే ఎవరో కావాలని ఈ ఇష్యూని హైలెట్ చేస్తున్నారనిపిస్తుంది.

సోషల్ మీడియా ఖాతాల్లో తోటి హీరోలను ఫాలో అవ్వడం.. వారిని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేయడం సర్వసాధారణం. ఐతే చరణ్ ఇదివరకు అల్లు అర్జున్ ని ఫాలో చేశాడా లేదా అన్న క్లారిటీ లేదు. అయినా కూడా చరణ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడంటూ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఐతే ఈ హీరోల మధ్య ఫ్యాన్స్ ఊహించుకుంటున్న ఈ గ్యాప్ ని దగ్గర చేయాల్సిన బాధ్యత ఆ హీరోల మీదే ఉందని చెప్పొచ్చు. స్టార్ హీరోలంతా కూడా బిజీ బిజీ షెడ్యూల్ తో వారి సినిమాలు చేస్తున్నారు. ఐతే అలాంటి టైం లో అసలు వారు సోషల్ మీడియా గురించి పట్టించుకునే ఛాన్స్ లేదు. అలాంటిది ఈ ఫాలో అన్ ఫాలో అన్న విషయాలైతే చాలా లైట్ తీసుకుంటారని చెప్పొచ్చు.