Begin typing your search above and press return to search.

ఛావాకు ఎన్టీఆర్.. కుదిరే ప‌నేనా?

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు మ‌రో సినిమాకు వాయిస్ ఇవ్వ‌నున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Feb 2025 4:48 AM GMT
ఛావాకు ఎన్టీఆర్.. కుదిరే ప‌నేనా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ జెన‌రేష‌న్ స్టార్ హీరోల్లో ప్ర‌తి విష‌యంలో ప‌ర్ఫెక్ష‌న్ ఉన్న న‌టుడిగా ఎన్టీఆర్ మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాడు. డ్యాన్స్ ద‌గ్గ‌ర నుంచి డైలాగ్ డెలివ‌రీ వ‌ర‌కు ఎన్టీఆర్ ప్ర‌తీ దాంట్లో త‌న‌దైన శైలిలో ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌డు. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ కు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

కేవ‌లం తార‌క్ వాయిస్ వ‌ల్లే ఎన్నో సీన్స్ పండిన సంద‌ర్భాలున్నాయి. అయితే ఈ మ‌ధ్య ఎన్టీఆర్ త‌న సినిమాల‌తో పాటూ ఇత‌ర హీరోలు న‌టించిన సినిమాల‌కు, వేరే న‌టుల సినిమాల‌కు సంబంధించిన టీజ‌ర్ల‌కు వాయిస్ ఓవ‌ర్ ఇస్తూ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయ్యాడు.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు మ‌రో సినిమాకు వాయిస్ ఇవ్వ‌నున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఛావా సినిమా షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. విక్కీ కౌశ‌ల్ హీరోగా డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఉటేకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కింది.

హిందీ భాష‌లో మాత్ర‌మే రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి టాక్ ను తెచ్చుకుంది. హిందీలో త‌ప్ప ఛావా మ‌రే భాష‌లోనూ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ ను రిలీజ్ చేయాల‌ని ఆడియ‌న్స్ ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. తెలుగు డ‌బ్బింగ్ ఇంకా క‌న్ఫ‌ర్మే కాలేదు. కానీ దీని గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఛావా తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ కోసం ఎన్టీఆర్ వాయిస్ అందించ‌నున్నాడ‌ని ఆల్రెడీ వార్త‌లు మొద‌ల‌య్యాయి. తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ విష‌యంలో చిత్ర నిర్మాత‌ల నుంచి ఎలాంటి క్లారిటీ లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నాడ‌ని వార్త‌లు మొద‌లైపోయాయి. అస‌లే ఎన్టీఆర్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రో సినిమాకు డబ్బింగ్ చెప్ప‌డం ఎక్క‌డ కుదురుతుంద‌నేది ఆలోచించాల్సిన విష‌యం. ఒక‌వేళ నిజంగా ఛావా తెలుగు డ‌బ్బింగ్ కు నిర్మాత‌లు ప్లాన్ చేసి, ఆ డ‌బ్బింగ్ ను ఎన్టీఆర్ తో చెప్పిస్తే అది నెక్ట్స్ లెవెల్ కు రీచ్ అవ‌డం ఖాయం.