Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 'కిల్' కాంబినేషన్.. నిజమేనా?

ఇకపై ఈ హీరో సినిమా ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఒక బాలీవుడ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టినట్లు టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 3:30 PM GMT
రామ్ చరణ్ కిల్ కాంబినేషన్.. నిజమేనా?
X

RRR వంటి ప్రపంచ స్థాయి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత తన కెరీర్‌ను మరింత పాన్ఇండియా స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, ఆ తరువాత అతను కీలక పాత్రలో నటించిన ఆచార్య ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో చరణ్ బాక్సాఫీస్ ట్రాక్ దారి తప్పినట్లయ్యింది. ఇకపై ఈ హీరో సినిమా ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఒక బాలీవుడ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టినట్లు టాక్ వస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ RC16 అనే ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సానాతో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్‌లో ఉండబోతుంది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ థీమ్‌ను కలిపి చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చరణ్‌ను మళ్లీ ఫామ్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెరకెక్కుతోంది.

ఇదే సమయంలో, RC17 ప్రాజెక్ట్‌పై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సుకుమార్‌తో మరోసారి రీ యూనియన్ కానున్న రామ్ చరణ్, రంగస్థలం తరహాలో ఓ మాస్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అయితే, చరణ్ మరోవైపు వరుసగా పలువురు దర్శకులతో కథలు వినిపిస్తున్నాడని టాక్. బుచ్చిబాబు, సుకుమార్‌ల తర్వాత చరణ్ దృష్టి బాలీవుడ్ దర్శకులపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది హిందీ డైరెక్టర్లను లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అంతేకాదు, ఇటీవల హిట్ మూవీ 'హాయ్ నాన్న' దర్శకుడు శౌర్యవ్‌, చరణ్ కు కథ వినిపించుకున్నట్లు టాక్. ఈ కథ లైన్ బాగా నచ్చినట్లు సమాచారం. అయితే పూర్తి కథ విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో మరో ఇంట్రెస్టింగ్ లీక్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ మరో బాలీవుడ్ డైరెక్టర్‌ను తన లైన్‌లో పెట్టుకున్నాడట.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు, 2023లో బాలీవుడ్‌లో కిల్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ నగేష్ భట్. కిల్ మూవీ ట్రైన్ నేపథ్యంలో నడిచే యాక్షన్ థ్రిల్లర్. ఒక NSG కమాండో భారీ సంఖ్యలో దోపిడీ దొంగలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేదే కథ. ఈ సినిమా టేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తే, మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ కాంబోపై క్లారిటీ రానుందా? లేక ఇది కూడా మరో రూమరా? అనేది వేచి చూడాలి.