లైక్ కొడితే లవ్ చేసినట్లేనా?
తాజాగా మహ్మద్ సిరాజ్ 'బిగ్ బాస్' ఫేం మహీరా శర్మతో లవ్ లో ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
By: Tupaki Desk | 26 Nov 2024 9:30 PM GMTసెలబ్రిటీ లైఫ్ లో ఎఫైర్ వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో ఈ వార్తలు నిరంతరం చర్చకొస్తూనే ఉంటాయి. క్రికెటర్లు...బాలీవుడ్ హీరోయిన్ల మధ్య రిలేషన్ షిప్ అన్నది ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోన్న అంశం అది. కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకోగా...మరికొంత మంది ఆ బంధాన్ని ప్రేమ వరకూ సరిపెట్టారు. ఇంకొంత మంది ప్రేమ కథలు ప్రేమ లేఖల వరకూ పరిమితమయ్యాయి.
ఇలా బాలీవుడ్- ఇండియాన్ క్రికెట్ టీమ్ మధ్య ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉండనే ఉంది. తాజాగా మహ్మద్ సిరాజ్ 'బిగ్ బాస్' ఫేం మహీరా శర్మతో లవ్ లో ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మహీరా ఇటీవల కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి బాగా నచ్చి సిరాజ్ లైక్ కొట్టాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ కథనాలు మొదల య్యాయి.
లవ్ లేకుండా లైక్ ఎందుకు కొడతాడంటూ ఓ వర్గం వాదిస్తుంటే? సిరాజ్ అభిమానులు మాత్రం సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల ఫోటోలకు లైక్ కొట్టాలంటే లవ్ మాత్రమే చేయాలా? మామూలుగా లైక్ కొట్టకూడదా? లవ్ గివ్ లేదు. ఇదంతా ప్రచారం మాత్రమే అంటూ ఖండిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చ గురించి సిరాజ్ ఏమంటాడో?
గతంలో ఇదే తరహా కథనాల్లో వెంకటేష్ అయ్యర్ కూడా బుక్ అయ్యాడు. తెలుగు నటి ప్రియాంక జవాల్కర్ ఫోటోలకు లైక్ కొట్టడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ కథనాలొచ్చాయి. కానీ వెంకటేష్ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అదంతా అవాస్తమని తేలింది. అలాగే సారా టెండూల్కర్-శుభ్ మన్ గిల్ మధ్య కూడా ఇలాంటి ప్రచారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.