ప్లాప్ డైరెక్టర్ తో 70వ చిత్రమా?
తాజాగా 70వ చిత్రం కూడా పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం పెట్టుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 20 Jan 2025 7:30 AM GMTదళపతి విజయ్ 69వ చిత్రం తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ ప్రకటించడం..భారీ బహిరంగ ఏర్పాటు చేయడం..అధికార పక్షంపై విమర్శలు గుప్పించడం వంటి సన్నివేశాలతో విజయ్ పొలిటికల్ గా ఎంత సీరియస్ గా ఉన్నారు అన్నది అర్దమైంది. ఈ ఏడాది మిడ్ నుంచి పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతారని తమిళ ప్రజలు భావించారు.
అయితే విజయ్ ప్లానింగ్ లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా 70వ చిత్రం కూడా పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం పెట్టుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్ అభిమానుల్లో జోష్ ఊపందుకుంది. దళపతి రాజకీయాల్లోకి వెళ్లిపోతే 69వ చిత్రమే చివరి చిత్రం అవుతుందనే నిరుత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
అలాగే ఇక్కడో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. విజయ్ 70వ చిత్రం లాక్ చేసింది వెంకట్ ప్రభుతోనని ప్రచారం జరుగుతోంది. విజయ్ 68వ చిత్రం `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` ని వెంకట్ ప్రభు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. అంతకు ముందు అక్కినేని నాగచైతన్యతో `కస్టడీ` తెరకెక్కించి అతడికి భారీ ప్లాప్ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో విజయ్ 70వ చిత్రం మళ్లీ అతడి చేతుల్లోనే పెడుతున్నాడనే వార్త నిరుత్సాహ పరిచేదే. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. విజయ్ నటించిన గత చిత్రాలు `మాస్టర్`,` లియో`లను ఇదే సంస్థ నిర్మించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ 69వ చిత్రం హెచ్ . వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.