Begin typing your search above and press return to search.

ప్రియ‌మ‌ణి అది రాంగ్ అని ప్రూవ్ చేసింది!

దీంతో న‌టిగా ప్రియ‌మ‌ణి రిటైర్మెంట్ తీసుకున్న‌ట్లే న‌న్న చ‌ర్చ సాగింది. కానీ అమ్మ‌డి తాజా వేగం చూస్తుంటే ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ లేన‌ట్లే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   18 Aug 2024 8:30 AM GMT
ప్రియ‌మ‌ణి అది  రాంగ్ అని ప్రూవ్ చేసింది!
X

క‌న్న‌డ బ్యూటీ ప్రియ‌మ‌ణి ఒక‌ప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి హాట్ అప్పిరియ‌న్స్ కి ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ చిత్రాల్లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. హిందీలో న‌టించింది కొన్ని సినిమాలే అయినా అరుదైన పాత్ర‌ల‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుంది. ఇక వివాహం త‌ర్వాత కొంత కాలం ఇదే దూకుడు కొన‌సాగించింది.

దీంతో సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ అమ్మ‌డు తిరుగులేద‌నిపించింది. అయితే 2019-20 స‌మ‌యంలో అవ‌కాశాలు త‌గ్గిన‌ట్లు క‌నిపించింది. టీవీ షోల‌కు హోస్ట్ గా మ‌రింత బిజీ అయింది. అప్ప‌టికే ఆరేళ్ల‌గా హోస్ట్ గా ప‌నిచేస్తున్నా? అప్ప‌టి నుంచి మ‌రింత బిజీ అయింది. దీంతో న‌టిగా ప్రియ‌మ‌ణి రిటైర్మెంట్ తీసుకున్న‌ట్లే న‌న్న చ‌ర్చ సాగింది. కానీ అమ్మ‌డి తాజా వేగం చూస్తుంటే ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ లేన‌ట్లే క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం టీవీ షోల‌కు దూర‌మై న‌టిగా బిజీగా ఉంది. రెండేళ్ల‌గా చేతినిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ప‌నిచేస్తుంది. హీరోయిన్ ఛాన్సులు కాక‌పోయినా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో మెప్పిస్తుంది. అవే కొత్త అవ‌కాశాల‌కు దారులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు రెండేళ్ల‌గా సినిమాలు ఎక్కువ‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. కొత్త అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంటుంది.

సాధార‌ణంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో అవ‌కాశాలు రావ‌డం క‌ష్టం. బిజీ అవ్వ‌డం అన్న‌ది అంత‌క‌న్నా క‌ష్టం. ఇక టీవీ షోల వ‌ర‌కూ వెళ్లారంటే ? వెండి తెర అవ‌కాశాలు దాదాపు లేన‌ట్లుగానే క‌నిపిస్తుంది. కానీ ప్రియ‌మ‌ణి మాత్రం అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. చేతినిండా సినిమాల‌తో క్షణం తీరిక లేకుండా ప‌నిచేస్తోంది.