Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి మ‌ధ్య చీలిక‌...ఇది సిల్లీ గాసిప్!

ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ ల ధాంప‌త్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 8:30 AM GMT
ఆ ఇద్ద‌రి మ‌ధ్య చీలిక‌...ఇది సిల్లీ గాసిప్!
X

ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ ల ధాంప‌త్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఇద్ద‌రి జీవితాల్లోకి రాహో రావ‌డంతో ఆ దంప‌తుల్లో మ‌రింత సంతోషం నిండింది. షూటింగ్ ఉంటే ర‌ణ‌బీర్ సెట్స్ లో ఉంటున్నాడు. లేదంటే ఇంట్లో పాపాయితోనే ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు. అలియాభ‌ట్ కూడా కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌లేదు. నెల‌ల పాపాయిని చూసుకుంటూనూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది.

`రాహా`..ర‌ణ‌బీర్ ల‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? అన్న‌ది ఎన్నో సంద‌ర్భాల్లో రుజువు అయింది. ముఖ్యంగా రాహో జీవితం ఎలా ఉండాలి? అన్న‌ది ఇప్ప‌టి నుంచే ఓ ప్లానింగ్ వేసేస్తోంది అలియా. అంత‌గా త‌ల్లిదండ్రుల్ని రాహో ఇన్ ప్లూయెన్స్ చేస్తుంది. రాహో రాక‌తో ర‌ణ‌బీర్-అలియా మ‌ధ్య బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింద‌న‌డానికి ఎన్నో సంద‌ర్భాలున్నాయి. ఎక్క‌డికి వెళ్లినా రాహోని వెంట తీసుకెళ్లిపోతున్నారు.

ఇటీవ‌లే అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుక‌లోనూ మెరిసారు. ముంబై వీధుల్లో షికార్లు చేయాల‌న్నా? ఇద్ద‌రు జోడీగానే వెళ్తున్నారు. అయితే అలాంటి జోడీ మ‌ధ్య దూరం పెరిగిందంటూ బాలీవుడ్ మీడియాలో ఓసిల్లీ గాసిప్ షికార్లు చేస్తుంది. అందుకు మ‌రో న‌టిని ఎర‌గావేసిన‌ట్లు ప్రచారం చేస్తోంది. `యానిమ‌ల్` సినిమాలో ర‌ణ‌బీర్ క‌పూర్ -త్రిప్తి డిమ్రీ పెర్పార్మెన్స్ ఆధారంగా చేసుకుని అటుపై ఎలాంటి క‌థ‌నాలు వెలువ‌డ్డాయో తెలిసిందే.

ర‌ణ‌బీర్ క‌పూర్ ని ఉద్దేశించి ` బాబి-2` అంటూ డిమ్రీని నెట్టింట సంచ‌ల‌నం చేసారు. సంద‌ర్భం ఉన్నా లేక‌పో యినా ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే నెగిటివ్ సెన్స్ ని తీసుకొచ్చేప్ర‌య‌త్నాలు సాగాయి. తాజాగా త్రిప్తీ డిమ్రీ ముంబై బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో రూ. 14 కోట్ల విలువైన రెండు అంతస్తుల భవ‌నం కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ భ‌వనం వెనుక కూడా ర‌ణ‌బీర్ క‌పూర్ హ‌స్తముంద‌నే కొత్త ప్ర‌చారానికి బాలీవుడ్ మీడియా తెర‌తీసింది.

అయితే ఇదంతా సిల్లీ గాసిప్ లో ఉంది త‌ప్ప ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని చెప్పొచ్చు. హీరో-హీరోయిన్ మ‌ధ్య రొమాన్స్ కాస్త బోర్డ‌ర్ దాటితే ఈ ర‌క‌మైన ప్ర‌చారం స‌హ‌జ‌మే. కానీ అందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది క్షుణ్ణంగా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం కూడా అంతే ఉంది. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్-అలియాభ‌ట్ జోడీ ఎంతో సంతోషంగా ధాంప‌త్య‌ జీవితంలో ముందుకు సాగిపోతుంది.