సంక్రాంతి సినిమాలు.. రన్ టైమ్ ఎంత?
దీంతో ఇప్పుడు ఈ సినిమాల రన్ టైమ్ కోసం ఇప్పుడు నెట్టింట డిస్కషన్ జరుగుతోంది.
By: Tupaki Desk | 18 Dec 2024 7:08 AM GMTఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. 2024 సంక్రాంతికి గట్టి పోటీనే నెలకొంది. నాలుగు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు 2025 పొంగల్ వచ్చేస్తోంది. ముందు ఏవేవో పేర్లు వినిపించినా.. ఈ ఏడాది కూడా నాలుగు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి.
మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, గాడ్ ఆఫ్ ది మాసెస్ బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పొంగల్ బరిలో దిగనున్నాయి. కోలీవుడ్ హీరో అజిత్ విదాముయార్చి కూడా అప్పుడే రానుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాల రన్ టైమ్ కోసం ఇప్పుడు నెట్టింట డిస్కషన్ జరుగుతోంది.
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్.. జనవరి 10వ తేదీన విడుదల కానుంది. రామ్ చరణ్ విభిన్నమైన రోల్స్ లో సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా మంచి అంచనాలు నెలకొల్పిన గేమ్ ఛేంజర్ రన్ టైమ్.. రెండు గంటల 50 నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఇప్పుడు డాకు మహారాజ్ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జనవరి 12న రిలీజ్ అవ్వనుంది. ఆడియన్స్ కు మంచి మాస్ ట్రీట్ అందించేలా కనిపిస్తున్న డాకు మహారాజ్ మూవీ నిడివి.. 2 గంటల 45 నిమిషాలని వినికిడి.
ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలు మంచి హిట్స్ అవ్వడంతో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీపై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఆ మూవీ రన్ టైమ్.. రెండు గంటల 40 నిమిషాలుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్.. విదాముయార్చితో సంక్రాంతికి సందడి చేయనున్నారు. తిరుమేని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా.. రన్ టైమ్ 2 గంటల 45 మినిట్స్ అని సమాచారం. అలా సంక్రాంతికి వచ్చే నాలుగు చిత్రాలు కూడా 3 గంటల్లోపు రన్ టైమ్ తోనే ఉండనున్నాయన్నమాట. మరి ఆ విషయం ఏ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.