Begin typing your search above and press return to search.

లాంఛనంగా ప్రారంభం అయిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ బావమరిది మూవీ

గత కొన్ని రోజులుగా రుష్య సినిమాల్లో ఎంట్రీకి ట్రైనింగ్‌ అవుతున్నాడు. పలు కథలు విన్న తర్వాత ఈ సినిమాకు రుష్య ఓకే చెప్పాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 10:26 AM GMT
లాంఛనంగా ప్రారంభం అయిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ బావమరిది మూవీ
X

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలు నిర్మిస్తు అత్యధిక విజయాలను సొంతం చేసుకుంటున్న నిర్మాత నాగవంశీ. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ సినిమాలను నిర్మిస్తున్నారు. వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే డాకు మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రెండు మూడు కాదు ఏకంగా పదికి పైగా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ ఏడాది కనీసం అయిదు ఆరు అంతకు మించి సినిమాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


నాగవంశీ బ్యానర్‌లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం చాలా మందిలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ సినిమా అంటే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అవుతుంది. నాగవంశీ తనదైన శైలిలో విభిన్నంగా ప్రమోట్‌ చేయడం ద్వారా సినిమాకు ముందస్తుగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దాంతో మినిమం ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. అలాంటి నిర్మాత నాగవంశీ ఫ్యామిలీ నుంచి రుష్య హీరోగా పరిచయం కాబోతున్నాడు. నాగవంశీ బావమరిది రుష్య. గత కొన్ని రోజులుగా రుష్య సినిమాల్లో ఎంట్రీకి ట్రైనింగ్‌ అవుతున్నాడు. పలు కథలు విన్న తర్వాత ఈ సినిమాకు రుష్య ఓకే చెప్పాడని తెలుస్తోంది.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కాకుండా రుష్య మొదటి సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీమాయ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లలో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. నాగవంశీ, సాహు గారపాటి, చిన్నబాబు తదితరులు సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు, చుక్కపల్లి సురేష్‌ క్లాప్‌ కొట్టారు, చిన్నబాబు యూనిట్‌ సభ్యులకు స్క్రిప్ట్‌ను అందించారు. అదే సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు 'డాన్‌ బాస్కో' అంటూ టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు.


కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో మురళీ శర్మ ప్రిన్సిపల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. మిర్నా మీనన్‌ని లెక్చరర్‌ పాత్రలో చూడబోతున్నాం. రుష్క, మౌనిక, రాజ్‌ కుమార్‌ కాసిరెడ్డి, విష్ణు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. శంకర్‌ గౌరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మార్క్‌ కె రాబిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'డాన్‌ బాస్కో' సినిమాతో రుష్య హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.